Pages

4, ఆగస్టు 2013, ఆదివారం

నిన్న శనివారం దుబాయ్ లో భారతీయ వస్త్రధారణకి అవమానం జరిగిందా అనే సంఘటన జరిగింది.












నిన్న శనివారం దుబాయ్ లో భారతీయ వస్త్రధారణకి అవమానం జరిగిందా అనే సంఘటన జరిగింది.దుబాయ్ మెట్రో రైల్లోకి  ఎక్కే ఒక భారతియ పెద్దమనిషిని లోపలికి పోనివ్వలేదు.ఎవరో కాదు అక్కడ వున్న రక్షక సిబ్బంది ! దానికి కారణం ఏమిటో తెలుసా ..ఆ వ్యక్తి టిక్కట్ కొనకపోవడం కాదు.దోవతి ధరించి ఉండటమే సదరు పెద్దాయన చేసిన తప్పు. అది భారతీయుల సర్వ సాధారణ వస్త్రధారణ అని..పైగా శరీర భాగాలు అన్నీ నిండుగా కప్పేవున్నాయిగదా అని ఆయన కుమార్తె మధుమతి చెప్పినా ససేమిరా అన్నారట.

మన దేశంలో ఎంతో మంది అరబ్బు షేకులు వారిదైన పొడుగు అంగీలు ధరించి హాయిగా తిరుగుతుంటారు.మన దేశం లో ఎక్కడ వారిని అభ్యంతర పెట్టినట్టు చదవలేదు. చివరికి పై అధికారులదగ్గర ఫిర్యాదు చేస్తే వారిచ్చిన సమాధానం ఏమిటంటే అలాంటి రూల్స్ ఏమీ లేవు..గాని లోకల్ రక్షక సిబ్బంది వారి వ్యక్తిగత నిర్ణయం మేరకు అలా ప్రవర్తించివుండవచ్చునని సెలవిచ్చారట.  Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి