Pages

4, ఆగస్టు 2013, ఆదివారం

నిన్న శనివారం తెలుగు భక్తులు పూరీ క్షేత్రం లో తన్నులు తిన్నారు


నిన్న శనివారం తెలుగు భక్తులు పూరీ క్షేత్రం లో తన్నులు తిన్నారు.నిజమే...పూరీ జగన్నాధుని దర్శించుకుందామని వెళ్ళిన తెలుగు భక్తుల బృందం 20 మంది ఆలయంలోని శ్రీమందిరం వద్ద అక్కడి నిర్వాహకులు ఇంకా పూజారి చేతిలో బెత్తం దెబ్బలు చవి చూశారు.మన వాళ్ళు వెళ్ళేసమయానికి దర్శనం చేసుకునే సమయం అయిపోయింది.అక్కడి నిర్వాహకులు కొంత డబ్బులు లంచంగా తీసుకుని కొంత మందికి దర్శనం ఇప్పించారు.అయితే సందట్లో సడేమియా లాగా ఒకామె డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటుండగా వెనక నుంచి ఒక పూజారి బెత్తం తీసుకుని ఇష్టం వచ్చినట్టు బాదాడు.మన వాళ్ళు 20 మంది కదా ని ఎదురు తిరిగి ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా మళ్ళీ దౌర్జన్యానికి సిద్ధమయ్యారట.దీనితో అక్కడి పోలిస్ ఠాణాలో ఫిర్యాదు ఇచ్చారు తెలుగు భక్తులు.

పూరీ లో ని జగన్నాధుని  ఆలయ నిర్వాహకుల యొక్క..పూజారుల యొక్క దురుసు ప్రవర్తన జగద్విదితం.ఇటీవల  తాము అడిగినంత పైకం ఇవ్వలేదని ప్రఖ్యాత ఒడిస్సీ నృత్యకారిణి,ఇటాలియన్ జాతీయురాలు అయిన ఇలియానా సిటరెస్టి ని కూడా ఇలాగే బాదారు.ఆమె పోలిస్ కంప్లైంట్ ఇవ్వడంతో మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చి రాజీ కుదుర్చుకున్నారు. Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి