కాటమ రాయుడు ప్రసిద్ది చెందిన యాదవ వీరుడు...!ఈయన గురించి తిక్కన సోమయాజి తన కావ్యం లో ప్రస్తావించారు.పశువులని మేపుకోవడానికి ఆ రోజుల్లో రాజుకి పుల్లరి (tax)చెల్లించవలసి వుండేది.దాని ని పరిధికి మించి పెంచడం వల్ల అప్పటి నెల్లూరు పాలకులకి ,పశుపాలకులకి మధ్యన జరిగిన యుద్ధం లో కాటమ రాజు మరణించుతాడు.ఈయన్ని గురించి చాలా పాటలు జానపదులు పాడుకుంటారు. వీరుల త్యాగాలను స్మరించుకునే క్రమంలో జానపదులు తమకి తోచిన వ్యాకరణంలో,భాషలో పాటలు ఆశువుగా రచించుకుంటారు.ఒక్కోసారి ఆ పాట ఎవరు రాశారో కూడా మనకి తెలియదు.అయితే అవి జీవంతో తొణికిసలాడతాయికాబట్టి ప్రజల్లోకి చొచ్చుకుపోతాయి.
ప్రాదేశిక హద్దులు కూడా ఇప్పుడున్నట్లుగా అప్పుడు లేవు కనుక అతడి గురించిన పాటలు తెలంగాణా,కోస్తా లోకి
కూడా వచ్చాయి.ముఖ్యంగా పల్లెటూళ్ళలో యాదవులని ఆశ్రయించి వుండే కొన్ని కులాలు వీటిని బాగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు.అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన "కాటమ రాయడా..కదిరి నరసిం హుడా" పాట విన్నాక ఈ వివరణ రాయాలనిపించింది.కాటమ రాయుణ్ణి కదిరి నరసిమ్హ స్వామి తో పోల్చడం బహుశా ఆ గీతాన్ని రాసిన జానపదుల ఉద్దేశ్యం కావచ్చు..!Click here for more

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి