Pages

6, ఆగస్టు 2013, మంగళవారం

కె.ఏ.పాల్ ని వేధించిన పాపమే వై.ఎస్.కుటుంబానికి తగిలిందా..?



ఎందుకనో నిజమేనేమో అనిపిస్తుంది..కొన్నిసార్లు!మొదట్లో  కె.ఏ.పాల్ ని చాలా మంది తమిళ క్రైస్తవ సువార్తికుడని అనుకునేవాళ్ళు.తెలుగు ఏ మాత్రం ఎక్కడా మాట్టాడకుండా ఇంగ్లీష్ లోనే యమ ఫ్లూయెంట్ గా సువార్త బోధ టి.వి.ల్లో చేస్తూ వెలిగిపోయెవాడు.విమానాల్లో దేశ దేశాలు తిరుగుతు లగ్జరీగా క్రైస్తవ బోధలు చేస్తుండే అతడిపై మరి వై.ఎస్.కి ఎక్కడ మండిందో గాని ....అతడి సువార్త సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చాడు..వాళ్ళ అన్నదమ్ముల్లోనే చీలికలు తెచ్చి ఆస్తి తగాదాలు రేపెట్టాడు. ఒక బికారిలా..జోకర్ లా అయిపోయాడు పాల్ ఆ దెబ్బకి .

వై.ఎస్. కూడా క్రైస్తవుడే అయినా  బహుశా అతని అల్లుడైన బ్రదర్ అనీల్ ని నెంబర్ వన్ గా నిలపడానికో..లేదా ప్రయోజనం కల్పించడానికో పాల్ ని చాలా తీవ్రంగా వేధించి శంకరగిరి మాన్యాలు పట్టించాడు....అని అనుకోవచ్చునేమో...!

విదేశాలనుంచి మిషనరీ కార్యకలాపాల పరంగా డబ్బు పొందే విధానాలు ఆల్రెడీ వాళ్ళకి బాగా తెలుసు. దీంట్లో కొన్ని అసూయలు లాంటివి కూడా ప్లే చేస్తుంటాయి.విదేశీయులు వీళ్ళు అనుకునేంత అమాయకులు కారు.కొంత స్వంతానికి వాడుకున్నా ..కొంత కొన్ని కార్యక్రమాలకి ఖర్చు అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు చూస్తారు.తమకి loyal గా వుండే ఒక వర్గాన్ని తయారు చేసుకోవడం అనేది కూడా ఒక వ్యూహం గా వుంటుంది దీని వెనుక.

మిగతా డినామినేషన్లు ఫండ్స్ పొందకుండా చేయడం కూడా కొన్ని విదేశీ శక్తులకి మండి వుండవచ్చు.అతని మరణం అత్యంత భీకరంగా ..ఒక హెచ్చరిక లా ఉండటం..పైగా అతని కుటుంబం పాల్ ని మించిన అవమానాలు పొందుతూ ..డబ్బున్నా ...దేనికీ వుపయోగపడకుండా పోవడం..ఇంతకాలం జైల్లో ఎలాంటి బెయిల్ లేకుండా మగ్గడం ...ఎందుకనో ఇదంతా ఆ దేవుని నడిపింపేనేమో అనిపించకమానదు. Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి