Pages

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

"గండికోట లో" సినిమా పై నా రివ్యూ!



వాల్ పోస్టర్ లలో మంత్ర గాళ్ళు....ఇంకా ఊరించే సీన్లు ఉండటం తో ఎలా ఉందో చూద్దాం సినిమా అని చెప్పి గండికోట లో అనే ఈ సినిమాకి వెళ్ళాను.హీరో హీరోయిన్లు కొత్తవాళ్ళు ,అలాగే డైరెక్టర్ నిర్మాతలు కూడా కొత్తవాళ్ళ లాగే వుంది.నా అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు..పైగా పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి.ఎంచుకున్న కధ కి..ఇంకా గండి కోట ని చక్కగా ఎక్స్ పోజ్ చేసినందుకు ఈ సినిమా బృందానికి ప్రతి తెలుగు ప్రేక్షకుడు/రాలు థాంక్స్ చెప్పాలి.

ఈ గండి కోట కడప జిల్లాలో జమ్మలమడక కి సమీపం లో ఉంటుంది.చాలా చరిత్ర వున్న కోట ఇది.13 వ శతాబం లో నిర్మించబడింది.దీన్ని ఇంకో అందుకు చెప్పుకోవాలి....ఈ కోటకి మూడు వైపులా బ్రహ్మాండమైన నదీ ప్రవాహం చేత ఏర్పడిన లోయ ఉంటుంది.ఇది చాలా పొడుగ్గ సుందరంగా ,భయంకరంగాను ఉంటుంది.దీన్ని ఇంగ్లీష్ లో canyon లేదా gorge అంటారు.ప్రపంచంలో చాలా అరుదుగా ఏర్పడే భూస్వరూపం ఇది.అతి పెద్దది అమెరికాలో వున్నది.ఆ తరవాత అంత సుందరమైన లోయ ప్రవాహం మన ఈ గండికోట వెనకాలే ఉన్నది.కాని మనం ఇది గుర్తించం...ఎందుకంటే తెలుగువాళ్ళం కదా...ఏవరో వచ్చి చెబితే తప్ప మనకెక్కదు.

అలాంటి ఈ గండి కోట ని..ఇంకా ఈ gorge ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడమే గాక ప్రధాన కధతో ముడివేసిన సిన్మా దర్శకునికి,రచయితలకి జేజేలు చెప్పాలి.సినిమాలో గ్రాఫిక్స్ కొద్దిగా ఎక్కువే వున్నా నిజమైన కోటని..ఆ లోయని బాగా చూపించారు.హీరోయిన్ (అనూశ్రీ)కి భవిష్యత్ వుంది. హిరో  ఫరవాలేదు. ఈ సిన్మాకి ప్రాణం ఘంటాడి కృష్ణ సంగీతం అని చెప్పాలి.ఎక్కడ బోరు కొట్టకుండ మంచి ఎంటెర్టైనర్ గా మలిచిన దర్శకుడు అభినందనీయుడు.  Click here for more   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి