Pages

17, నవంబర్ 2013, ఆదివారం

ఏమైనా ఇలాంటి హుందాతనం నిండిన నటీమణులు చాలా తక్కువ!



సుజాత... చూడటానికి ఎంతచక్కని రూపం..!అలానాడు గోరింటాకు సినిమాలో  ఆమె రూప లావణ్యాలు..అభినయం అంత తొందరగా మరిచిపోయేవా..? ఇప్పటి జీరో సైజ్ హీరోయిన్ల తో పోల్చితే  కొద్దిగా లావు వుండే మాట నిజమే అయినా ..చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేదామె.ఆమె నవ్వు,అభినయించే కళ్ళు చాలా బావుండేవి.కొద్దిగా వయసు మళ్ళిన తరువాత తల్లి వేషాలు వేసినప్పటికీ అదే ఆకర్షణీయత వుండేది.హీరోయిన్ గా మంచి  దశలో ఉన్న రోజుల్లో కూడా ఎప్పుడూ ఓ పరిధికి మించి ఆమె ఎక్స్ పోజింగ్ చేయకపోయినా చాలా మంది అభిమానించేవారు ఆమెని.నేను చదువుకొనే రోజుల్లో ఒక సారి ఉత్తరం రాస్తే ఆమె నాకు ఓ ఫోటో పంపింది.అది ఎనభైవ దశకం లోని మాట.ఆమె మొదటి చిత్రం ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ అనే మళయాళీ సినిమాలో చూసిన బాలచందర్ ఈమె ని తమిళ సినిమాకి పరిచయం చేశారు.   

అవర్ ఒరు తొడర్ కధై (తెలుగులో అంతులేని కధ) లో హీరోయిన్ గా విజయఢంకా మోగించడం తో ఇతర దక్షిణాది భాషల్లో కూడా బాగా అవకాశాలు వచ్చి టాప్ రేంజ్ కెళ్ళింది ఓ దశలో..!సుజాత,బహుదూరపు బాటసారి ఇలా తెలుగు లో ఎన్నో  మంచి సిన్మాలు చేసిన ఆమె 2011 లో మృతి చెందారు.  Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి