ధూం సిరీస్ లో ఇది మూడవది.సినిమా అంతా చికాగో లో నడుస్తుంది.అక్కడ గ్రేట్ ఇండియన్ సర్కస్ అనేదాన్ని జాకీ సరాఫ్ నడుపుతుంటాడు.ఒక బ్యాంక్ చేసిన మోసం వల్ల అతను దెబ్బతింటాడు .అతని ఇద్దరు కొడుకులు ఒక వేపు సర్కస్ నడుపుతూనే ..ఇంకోవేపు ఈ బ్యాంక్ ని దోచుకొంటూ దెబ్బతీస్తుంటారు.వీళ్ళిద్దరూ అమీర్ ఖాన్ లు..(double action) అన్నమాట.వీళ్ళని పట్టుకోవడానికి వచ్చిన వాడే అభిషేక్ బచ్చన్..!
కధ లో పాయింట్ అంతా దొంగల వేటే ననాలి.అయితే కొంత మెలోడ్రామా ..కత్రినా పాత్ర అందాలు.. డాన్సులు.. అలాసాగిపోతుంది.క్లైమాక్స్ సీన్ కధ లో బలం గా చెప్పాలి.సెంటిమెంట్తో దిమ్మతిరిగేలా కొడతాడు.లాజిక్ లు వెదక్కుండా చూస్తే ఆనందించి రావచ్చు.కత్రీన ప్రేక్షకుల ఆశల్ని వమ్ము చేయలేదు.అమీర్ ఖాన్ నటన ని మెచ్చుకొని తీరవలసిందే.పాటలు పరవాలేదు.సినిమా బోరుకొట్టదు.కనుక కలెక్షన్లు బాగానే రావచ్చు.దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య బాగానే లాక్కొచ్చాడు. Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి