మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడి కి వచ్చిన ఆలోచన మాత్రం చాలా విన్నూత్నమైనది.గత మంగళ వారం ఆయన ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధానికి టోనీ అబాత్ కి ఒక విలువైన కానుక నిచ్చారు.1854 వ సంవత్సరం లో ఝాన్సీ లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియ కంపెనీ వారికి సమర్పించడానికి ఒక పిటీషన్ ని జాన్ లాంగ్ అనే ఓ ఆస్ట్రేలియన్ లాయర్ చేత రాయించారు.ఆ రాత ప్రతిని ఇరుదేశాల ప్రధానుల ద్వైపాక్షిక చర్చలు జరిగే సమయం లో నరేంద్రమోడి ,ఆస్ట్రేలియా ప్రధానికి బహుమతిగా ఇచ్చారు.
ఆస్ట్రేలియా కి చెందిన జాన్ లాంగ్ 1816 లో సిడ్ని లో జన్మించారు.ఆయన ఆ దేశానికి చెందిన మొదటి నేటివ్ నవలా రచయిత కూడా.జాన్ లాంగ్ లాయర్ మాత్రమే కాదు.రచయిత,జర్నలిస్ట్,పర్యాటకుడు..!1842 లో ఇండియా వచ్చిన తర్వాత హిందీ భాషని కూడా నేర్చుకున్నాడు.The Moffsilite అనే న్యూస్ పేపర్ ని నడిపాడు.ప్రసిద్ధ కవి చార్లెస్ డికెన్స్ నడిపిన ఓ వీక్లీ కి కరస్పాండెంట్ గానూ ఉండేవాడు.ఝాన్సీ సంస్థానానికి రాణి గా ఉన్న స్వాతంత్ర్య యోధురాలు లక్ష్మీ బాయి కి Counsel గా వ్యవహరించారు.
ఝాన్సీ లక్ష్మీ బాయి పూర్వికులది వారణాసి..ప్రస్తుతం మోడి ఎం.పి. గా ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా వారణాసినుంచే నని మనకు తెలిసినదే.జాన్ లాగ్ కి చెందిన రాత ప్రతుల్నే గాక,ఆయనకి సంబందించిన పెళ్ళి సర్టిఫికేట్,ముస్సోరి చర్చ్ ప్రాంతం లో ఉన్న ఆయన సమాధి ఫోటో ఇలాంటి వన్నీ కానుక గా ఇచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి