Pages

24, నవంబర్ 2014, సోమవారం

అక్కడ ఉద్యోగం లో చేరాలంటే కన్యత్వ పరీక్షలుతప్పనిసరి..!



ఇండోనేషియా లో పోలీస్ శాఖలో చేరాలనుకునే స్త్రీ అభ్యర్దులకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం ని హ్యూమన్ రైట్స్ వాచ్ అనే మానవ హక్కుల సంస్థ ఖండించింది.ఈ వివక్షాపూరితమైన  ధోరణికి స్వస్తి పలకాలని వాళ్ళు వాదిస్తున్నారు.ఇండోనేషియా లో ఆరు నగరాల్లో ఇలాంటి టెస్ట్ లు నిర్వహించడం జరిగింది.భౌతికపరమైన అలాంటి పరీక్షలు కన్యత్వాన్ని నిర్ధారించడం లో తోడ్పడజాలవని అంటున్నారు.అయితే ఆ దేశపు పోలీస్ శాఖ స్పోక్స్ పర్సన్ రోనీ సోంపి మాట్లాడుతూ ఎస్.టి.డి. కి సంబందించిన వ్యాధులు కి దూరంగా ఉండాలనే స్పృహ పెంపొందించడానికే ఆ పరీక్షలు నిర్వహిస్తున్నామని స్త్రీలనే కాకుండా పురుష అభ్యర్ధులకు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి