Pages

23, డిసెంబర్ 2014, మంగళవారం

బాలచందర్ కీర్తిశేషులైయ్యారు...ఆయన నుంచి తెలుగు పరిశ్రమ నేర్చుకోవలసింది ఒకటి ఉంది.



ఈ రోజు ఎట్టకేలకు మృత్యువు తో పోరాడి తలవంచారు విఖ్యాత సినీ దర్శకులు కె.బాలచందర్ .మృత్యువు ఎంతటి మానవునికైనా తప్పదు.కాని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోగల అవకాశం కొంత మందికి మాత్రమే ఉంటుంది.దానిలో అగ్రగణ్యుడు బాలచందర్.ఎన్ని వైవిధ్యమైన సినిమాలు  ఆయన తీసినవి.ఆయన ఒక సినిమా లాంటిది ఇంకొకటి ఉండదు.అది ఎంత గొప్ప హిట్ గాని మళ్ళీ పిచ్చి సెంటిమెంట్ తో  అలాంటి ఇంకో జిరాక్స్ కాపీ లాంటి సినిమాని ఆయన తీయలేదు.మరోచరిత్ర,గుప్పెడు మనసు,ఆకలి రాజ్యం,ఇది కధ కాదు,అంతులేని కధ,ఇట్లా ఎన్ని సినిమాలనైనా ఉదహరించవచ్చు.ఇంకా ఆయన తమిళం లో తీసిన సినిమాలు ఎన్నో.బాలచందర్ పాత్రలు అన్నీ ఆకాశం నుంచి ఊడిపడినట్లు ఉండవు.చాలా సహజంగా ఉంటాయి.తమిళ్ ఇండస్ట్రీ లో ఉన్న గొప్ప సంగతి ఏమిటంటే పక్కా మాస్ సినిమాలు ఓ వైపు ఉంటాయి.అదే సమయం లో మంచి ప్రయోగాత్మత సినిమాలు ఆడతాయి.మనకి మల్లే ప్రతిభ ని కులం పేరు తోనో,ప్రాంతం  పేరు తోనో  తొక్కి వేడం ఉండదు.అందుకనే ఒక బాలచందర్ లాంటి మహా మేధావి అక్కడ నిలదొక్కుకోగలిగాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి