Pages

30, డిసెంబర్ 2014, మంగళవారం

మూత్రం పోస్తూ ఎలెక్ట్రిక్ షాక్ కి గురై ..ఏమిటో ఇదంతా..!



ఇటీవల పేపర్ల లో చదివాం.ఒకతను విద్యుత్ శాఖ వారు పెట్టిన సెట్ బాక్స్ ని అడ్డంగా చేసుకొని యూరిన్ పాస్ చేయాలనుకొని చేస్తూ అది అగ్ని జ్వాలలు కమ్మి అతన్ని దహించి వేస్తూండడం..జనాలంతా చోద్యం చూడడం..! ఇక్కడ ఎవరిది తప్పు నిర్లక్ష్యంగా జాగ్రత్త లేని స్థితి లో దాన్ని ఉంచిన విద్యుత్ శాఖ వారిదా లేక అక్కడ పోసిన ఆ మనిషిదా అంటే ఇద్దరిదా అంటే ఇద్దరిదీ అని చెప్పాలి.మరి అదేంటో గాని మన దేశం లో ఏదైన ఇన్సిడెంట్ జరిగినపుడు ఒకటి రెండు రోజులు తీవ్రంగా స్పందించడం..మళ్ళీ ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం ఒక శాపం లా మారింది.ఇదే సకల అనర్ధాలకీ కారణం.దానికి తగిన పర్మినెంట్ రెమిడి తీసుకోవాలని ఎవరూ అనుకోరు.మళ్ళీ సింగపూర్ తో పోటీలు పడే కబుర్లు చెప్తుంటారు పాలకులు..ప్రజలు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి