చంద్ర ముఖి దారి లో పేరు పెట్టారు బహుశా ఈ సినిమా కూడా హారర్ కామెడీ అనేమో..!అసలు విషయానికొస్తే చంద్రకళ సినిమా తమిళం లో అరణ్మనై అనే పేరు తో తీయబడింది.దానికి అర్ధం ప్యాలస్ అని..!ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి వద్దాం..! అనువాదం లో కొంత ఒరిజినల్ అంశ పోతుంది..తప్పదు..అయినా సినిమా లో దమ్ముంది.కొన్ని సీన్లు మొదట్లోవి ..మధ్య లోవి బాగానే భయపెడతాయి.అయితే చివరకి వచ్చేసరికి గ్రాఫిక్స్ పరమ కృతకంగా తయారై అంతసేపూ ఉన్న బిగి సడలుతుంది.కధాపరంగా చెప్పాలంటే చంద్ర మిఖి ,అరుంధతి లాంటి సినిమాల్ని కలిపి వండారు.
హన్సికా మోత్వానీ బాగా చేసింది.అందంగా నూ..నటన పరం గానూ ఆకట్టుకొనేలా ఉంది.ఆండ్రియా పాత్ర పరిధి మేరకు సరిపోయింది.సుందర్.సి హీరో గా చంద్ర ముఖి లో రజనీ కాంత్ టైప్ పాత్రలో చేశాడు.సినిమా మరీ బోరు కొట్టలేదు.ఒకసారి చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి