Pages

29, ఏప్రిల్ 2015, బుధవారం

మన దినపత్రికల తీరు చాలా విచిత్రమే.....


కొన్ని సార్లు అదేమిటో గాని వార్త లోని విశేషాలు పేపర్లలో విపరీతంగా రాస్తారు.అంటే ఒక విశేష వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు ఆమె చిన్నప్పటి యవ్వారాలు,పడిన కష్టాలు,ఇన్స్పిరేషన్స్ ఇంకా అల్లాంటివి అన్నమాట.కాని తీరా ఇపుడు వారు చేస్తున్న పని విధానాన్ని తెలుసుకునే అవకాశం మాత్రం ఇవ్వరు.అంటే వాళ్ళ గురించి వేసినట్లు ఉండాలి.మళ్ళీ వాళ్ళకి పెద్ద లాభం కలిగినట్లుగానూ కూడా ఉండకూడదు అనే పాలసి ఏమైనా ఉంటుందేమో.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఈనాడు (వసుంధర) లో వర్కింగ్ విమెన్ కి వాళ్ళకి హాస్టళ్ళ వివరాల్ని తెలిపే ఓ లేడీ ఎంటర్ప్రెన్యూర్ గురించి బాగానే రాశారు.ఆమె నడిపే వెబ్ సైట్ గురించి పుంఖానుపుంఖాలుగా రాశారు.విచిత్రంగా ఆ వెబ్సైట్ యు.ఆర్.ఎల్.అడ్రెస్ ని పొరపాటున ఒక్కచోట కూడా రాయలేదు.ఆ కాడికి అంత వ్యాసం రాయడం ఎందుకు..? ఏ పాఠకుడికైనా సగం భోజనం లాంటిదే అది.మనం డబ్బులిచ్చి కొనుక్కునేది పేపర్ కొనుక్కునేది దానికేనా అనిపిస్తుంది ఒక్కోసారి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి