Pages

4, అక్టోబర్ 2015, ఆదివారం

దేశానికి రాష్ట్రానికి తేడా తెలియదా..?



ఇటీవల కొన్ని వార్తల్లో చదవడం తటస్థించింది.హైద్రాబాద్ నుంచి తరలి ఆంధ్ర ప్రాంతానికి వచ్చేవారు2017 కల్లా రావాలని,ఆ తర్వాత వచ్చిన వారికి కొన్ని సౌకర్యాలు ఉండవని.అలా కనక ప్రకటించితే అది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికే గాక పౌరుని ప్రాధమిక హక్కుని కూడా  కించపరిచినట్లే చెప్పక తప్పదు.ఇప్పటికే ఆంధ్రులు మహారాష్ట్ర,తమిళనాడు,కర్నాటక వంటి రాష్ట్రాల్లో వ్యాపారాల్లో ,వివిధ ఉపాధుల్లో ఉన్నారు.అలాగే వారికి ఇళ్ళు ఇతర ఆస్తులు ఇక్కడా ఉన్నాయి.ఇంతకాలం ఇలాంటి వివక్ష తో కూడిన ప్రకటనలు వెలువడలేదు గాని హైద్రాబాద్ నుంచి వాచ్చే వారికి మాత్రం ఒక డెడ్ లైన్ ని విధించి బెదిరించినట్లు చేయడం ఎంతదాకా సమంజసం ..?ఏ రాష్ట్ర పౌరుడైనా  మరో రాష్ట్రం లో ఉపాధి పొందవచ్చు..వ్యాపారం చేయవచ్చు...అలాగే తన స్వ రాష్ట్రం లో ఆస్తులు కలిగి ఉండవచ్చును.అది భారతదేశం లోని ప్రతి పౌరుని హక్కు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి