Pages

14, జనవరి 2016, గురువారం

అసలు ఈ బీజం ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్.ల దగ్గరనుండి పడింది.

ఈరోజు భోగి సందర్భంగా టివి9 లో నటుడు బాలకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూ ని చూసిన తర్వాత వారసత్వం పేరు తో ఎలాంటి అజ్ఞాన జీవులు సినీ పరిశ్రమను ఏలుతున్నారో అవగతమైంది.అసలు తెలుగు నేల మీద సకల కళలు నాశన స్థితి కి చేరుకున్నది ఈ సినిమా కళ వల్లనే.ఇష్టం వచ్చినట్లు పెడ బొబ్బలు పెడుతూ ,మా నాన్న గారు అంటూ ఎప్పటివో గుర్తు చేస్తూ పరమ నికృష్ట దశకి సినిమా ఫీల్డ్ ని తీసుకు వచ్చారు. అసలు ఈ సినిమా ద్వారా ఎందుకని ఇలా హింసిస్తున్నారు..అంటే అతి తేలికగా జనాల్లో నాని ఆ గ్లామర్ తో అది ఇచ్చిన పరపతి తో రాజకీయాల్లోకి వచ్చేసి చక్రం తిప్పాలని. డబ్బు తో ముడి పడి ఉన్నదే సినిమా అనేది..అది ఎవరికైన తెలుసు.. కాని మరి అదే సమయం లో ఎన్నో కొన్ని మంచి ఆలోచనాత్మక సినిమాలు సైతం ఇతర భాషల్లో వస్తున్నాయి అంటే ఈ బాపతు కళాకారులే కారణం.తాను లేస్తే మనిషిని కాదు అంటూ అర్ధం వచ్చే వీర డైలాగులు ,వాచాలత్వ సోది గా ఉండే డైలాగులు విని విని వాంతి వస్తున్నది.పక్కనుండే తైనాతీలు మాత్రం ఆహా ఓహో అంటూ వంత పాడి ఈ నటుల్ని ఇంకా పాడు చేస్తున్నారు.తెలుగు నేల మీద చిత్ర కళ(డ్రాఇంగ్ గురించి)  కి ,జానపద కళలకి,సంగీత కళలకి ఎక్కడుంది అసలు ప్రొత్సాహం..ఎంత సేపు చీకు లు నాకే సినిమా కబుర్లు కే తప్ప ఇంకోదానికి ఏది ఎంకరేజ్ మెంట్..! అసలు ఈ బీజం ఎన్.టి.ఆర్.ఏ.ఎన్.ఆర్.ల దగ్గరనుండి పడింది.చెత్త మాస్ సినిమాల్నే వాళ్ళు ప్రోత్సహించింది...ముఖ్యంగా దర్శకుల కి చెల్లుబడి పోయిన తర్వాత పరమ రోత సినిమా సంస్కృతికి బాటలు వేశారు.వారి బాట లోనే ఆ తర్వాత వారునూ..లోకం ఎంత విన్నుత్నం గా ..ఆలోచనాత్మకంగా సాగుతున్నదో ఈ కంప్యూటర్ యుగం లో వీరికి తెలియదేమో గాని మారు మూల కుగ్రామం లో ఉన్న జనానికి సైతం ఇప్పుడు తెలుసు. 

1 కామెంట్‌: