Pages

20, జనవరి 2016, బుధవారం

అమెరికా నుంచి ఎందుకు వెనుదిరుగుతున్నారు తెలుగు విధ్యార్థులు..?


గత కొన్ని వారాల నుంచి ఒకటే వార్తలు.తెలుగు విద్యార్థుల్ని వెనక్కి పంపిస్తున్న అమెరికన్ అధికారులు.బెంబేలు పడుతున్న కుటుంబాలు...అంటూ ఒకే వార్తలు.అసలు పొలోమంటూ అమెరికా పోవడం అనేది ఈ మధ్య ఒక ఫేషన్ అయిపోయింది.పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మెల్లగా అక్కడ స్థిర పడటానికే మన వాళ్ళ పాట్లు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఆ చేరే యూనివర్శిటీ లు కూడా  వచ్చే గొర్రె లాంటి ఇలాంటి వాళ్ళని  చేపించుకోడానికి పుట్టినవే.ఆ అసలు ఆ మందం చదువులు ఇండియా లో లేకనా..?ఫలానా వాడు అక్కడ ఉన్నాడు..నేను వెళ్ళాలి లేదా మా వాడూ వెళ్ళాలి..ఇదీ ప్రస్తుత ట్రెండ్.ఈ చదువులు చదివిన వారంతా అక్కడ ఏ అపూరూప పరిశోధనలు చేసి అక్కడి దేశానికి సాయపడుతున్నారని.పైగా ఇక్కడి కొన్ని దుస్సంప్రదాయాల్ని  అక్కడ పాకిస్తున్నారు.


అసలు వీసా లు మంజూరు ఎందుకు చేయాలి,ఆ తర్వాత ఎందుకు వెనక్కు పంపించాలి అని కొందరి వితండవాదం చేస్తున్నారు.అది వారి దేశం.వారి  ఇష్టం.ఏ అంతర్జాతీయ కోర్ట్ లో ఫిర్యాదు చేస్తారు దీన్ని.మన కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యలు అసలు తమకేమాత్రం సంబంధం లేనట్టుగా చూస్తున్నాయి.మన లొసుగులు ఉన్నాయని వాళ్ళకి తెలుసు.అందుకే ముసుగు వేసుకుని అట్లా పోతుంటారు...కిమ్మనకుండా..! 


1 కామెంట్‌: