Pages

24, జనవరి 2016, ఆదివారం

రోహిత్ ఆత్మహత్య: మరో కోణం


కులం కోణం తో,మతం కోణం తో ,విద్య కోణం తో రకరకాల వాదనలు రోహిత్ ఆత్మహత్య తర్వాత వస్తున్నాయి.ప్రతి వర్గం తమవైన రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాని కొన్ని మౌలిక విషయాలు మరిచిపోతున్నారు.అసలు యూనివర్శిటి స్థాయి పరిశోధక విధ్యార్ధులు తమ సబ్జక్ట్ లో ఏం ప్రగతి సాధిస్తున్నారో అవి సమాజానికి ఎలా వినియోగపడుతున్నాయో తెలియదు గాని వాళ్ళకి సంబంధం లేని మెమన్ లాంటి  దేశ ద్రోహ నేరస్థులకోసం పోరాడటం ,బీఫ్ ఫెస్టి వల్స్ కోసం పని చేయడం ఏమిటి..? ప్రభుత్వం రిసెర్చ్ స్కాలర్స్ కి ఇచ్చే డబ్బులు అందు కోసమేనా..?మెమన్ కోసం ఎంతమంది అయినా అరవచ్చుగాక అమాయకులైన ప్రజల్ని పొట్టన బెట్టుకున్న ఉగ్ర దాడి కి రూప కర్త అయిన వాడికి సానుభూతి ఏమిటి..చచ్చిపోయిన ఆ ప్రజలకి మానవ హక్కులు లేవా ..వాళ్ళుమానవులు కారా..?ఈ దేశం లో కాబట్టి చెల్లుతుంది గాని ఇలాంటి స్థితి వేరే దేశం లో తలత్తితే ప్రజలు తుపాకులు తీసుకొని బయటకి వస్తారు. దీనికి బాద్యులు కుహనా పొలిటీషియన్లు కూడా.దేశ రక్షణ విషయం లో పార్టీకొక దృక్పధం ఉండడం విచారకరం.అదే అన్నిటికీ మూలం.

అసలు అంబేద్కరిష్టులు ,మైనారిటీ లతో కలసి పోరడతాం అనడం లో ఔచిత్యం లేదు.ముస్లింల సమస్యలు,దళితుల సమస్యలు ఎలా ఒకటవుతాయి.ఏ రకంగా ఒకటి కావు.కేవలం కొన్ని దేశ వినాశక వర్గాలు హిందూ ఓటు బ్యాంక్ ని చీల్చడానికి ,అంతర్గత వైమనస్యాలతో హిందూ సమాజం ఏకం కాకుండా ఉండటానికి వేసే ఎత్తుగడల్లో వీరు పావులు కారాదు.అగ్ర అర్ణాలు సైతం తమ అభిజాత్యాన్ని,అహంకారాన్ని వదులుకొని దేశ విశాల హితం కోసం కుల పరమైన భేదాల్ని తగ్గించడానికి తమ వంతు కృషి చేయాలి.అలాంటి విభజన తోనే కొన్ని వందల ఏళ్ళు పాటు ప్రతి అడ్డమైన తెగ దేశం లోకి వచ్చి ప్రజలందరని సునాయసం గా ఓడించగలిగారు.

ఇది ఒక సంధి యుగం.కొత్త ఆలోచనల తో ముందుకు పోకపోతే మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో  దళితుల ని కలుపుకు పోకుండా  ఉన్నట్లయితే మొత్తం హిందూ సమాజానికే దెబ్బ.చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే హిందువులు బానిస జాతి గానే గుర్తింపబడతారు.దానిలో సందేహం లేదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి