Pages

10, మార్చి 2016, గురువారం

విజయ్ మాల్య ప్రస్తుతం అక్కడున్నట్లు సమాచారం...



9000 కోట్ల రూపాయల కుచ్చు టోపీని 17 బ్యాంక్ ల నెత్తిన పెట్టి చల్లగా విదేశాలకి జారుకున్న విజయ్ మాల్య లండన్ కి గంట ప్రయాణం లో ఉన్న ఓ గ్రామం "Tiwen"  లో ఉన్నట్లు ఒక మీడియా సంస్థ తెలిపింది.నిన్న కూడా సాయంత్రం ఒక పబ్ కి వెళ్ళాడుట.ఆ లొకేషన్ లో ఎక్కువగా ధనికులు నివసిస్తూంటారు..అడుగడుగునా నిఘా నేత్రాలు ఉంటాయి.ఎవరినైనా అడిగినా సమాధానం ఉండదు.ఆ పార్టీ మీద ఈ పార్టీ ,ఈ పార్టీ మీద ఆ పార్టీ దుమ్ముపోసుకున్నట్లు కనిపిస్తుంటాయి గాని ఇలాంటి పెద్ద స్థాయి అక్రమార్కుల్ని రక్షించడం లో తలా ఓ చెయ్యి వేస్తారు.ఎందుకంటే మన దేశ పాలనా విధానం అది.రాజ్యాంగం లో చట్టం ముందు అందరూ సమానులు అని రాసుకోగానే కాదు.అది అమలు అయ్యేట్టు చూడగల దమ్ము ప్రజల్లో కూడా ఉండాలి.అసలు అంటే కోపం గాని ప్రజాస్వామ్యం అనే పద్ధతే మన దేశానికి సరిపడదు.రోమ న్ ల గ్రీక్ ల కాలం నుంచి ప్రజాస్వామ్య  విత్తనాలు యూరపులో పాదుకొని ఉన్నాయి.ఆ ప్రజా చైతన్యం వేరు.సామాజికంగా ఎక్కువ అంతరాలు లేని సమాజాల్లో ,ప్రజలు అవసరమైతే అంతర్యుద్ధం ప్రకటించే చైతన్యపూరిత వాతావరణం లో ప్రజాస్వామ్య పరిణితి వేరు.ఇక్కడ మనదగ్గర బయటకి పార్టీలు వేరు గా కనిపించవచ్చు గాని అక్రమార్కుల్ని పట్టుకుని శిక్షించడం లో అన్నీ అన్నే.అధికారం లోకి రావడం భూములు ,ఆస్తులు పెద్ద ఎత్తున వెనకేసుకోవడం మళ్ళీ పైకి సుద్దులు వల్లించడం..అన్నీ తెలిసీ సర్దుకొని అలా పోవడం మనకి అలవాటయిపోయింది.ఇక మన కోర్ట్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి