Pages

15, జనవరి 2019, మంగళవారం

"ఎన్ టి ఆర్ కధానాయకుడు" సినిమా పై ..నా రివ్యూ!



రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తాయి ఈ సినిమా మీద.చూద్దాం అని చెప్పి ఈ రోజు వీలు చేసుకొని చూశా.మరీ అంత చెత్త గా లేదు అలాగని నభూతో నభవిష్యతి లాగానూ లేదు.బాలకృష్ణ నటించిన బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు.ఆ కాలం లోకి తీసుకెళ్ళడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.కీరవాణి సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి.అయితే రాముడు మంచి బాలుడు లాగా మొదటినుంచి చివరి దాకా మితి మీరిన పొగడ్తలు,పైకి ఎత్తే కార్యక్రమం కూడా సినిమా సన్నివేశాల్లో అడ్డూ ఆపూ లేకుండా సాగింది.కొన్నిసార్లు అది చికాకు కూడా కలిగిస్తుంది.

ఎన్ టీ ఆర్ గొప్ప నటుడు ,దానిలో సందేహం లేదు.కాని ఆ స్థాయికి తను చేరడం లో అతని సోదరుడు త్రివిక్రమ రావు పాత్ర చాలా గణనీయమైనది బయట అందరకీ తెలుసు.ముఖ్యంగా ఎన్ టీ ఆర్ కి పోటీ గా ఎదిగే నటులని అణచి వేయడం లో ఆయన పాత్ర ఉందని అంటారు.ఇక్కడనే కాదు కన్నడం లో రాజ్ కుమార్ సూపర్ స్టార్ అయినా దాని వెనుక కీలక పాత్ర పోషించింది అతని సోదరుడే.అసలు ఏ వ్యక్తి అలాంటి ఒక టాప్ పోజిషన్ లోకి వెళ్ళినా దానికి సహకరించే యోధులు తెరవెనుక తమ పాత్ర పోషించడం వల్లనే.

రాజకీయ క్షేత్రం లో ఎన్ టీ ఆర్ దెబ్బతినడం దానివల్లనే.ఆవేశం,గ్లామర్ ,మాటకారితనం వీటికి మించి రాజకీయం లో ఇంకా కొన్ని లక్షణాలు ఉండాలి.అవన్నీ పుష్కలం గా ఉండబట్టే చంద్రబాబు మాయావ్యూహం లో చిక్కుకుని అమర్యాదకరమైన రీతి లో మరణించాడు.మన తెలుగు వాళ్ళ తో చిక్కు ఏమిటంటే బయో పిక్ అంటే తీస్తే సూపర్ మేన్ లా తీస్తారు.లేదా పరమ దుర్మార్గం గా తీస్తారు.ఎంత గొప్ప మనిషి అయినా అతనికి మంచి,చెడు అనే రెండు కోణాలు ఉంటాయి.అది అర్ధమయ్యి తీసే రోజు ఎప్పడొస్తుందో చూద్దాం.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి