పొన్నియన్ సెల్వన్ సినిమా వల్ల,చోళుల కి మన తెలుగు రాష్ట్రం లోని ఓ కులానికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం ఈ మధ్య మళ్ళీ కలిగింది. ఒక్కోసారి చారిత్రక మూలాలు అలాగే దాక్కుండి పోతాయి. ఆ కులస్థులకి కూడా అంత అవగాహన తమ పూర్వ మూలాలు గురించి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతున్న కులాలే అన్ని కాలాల్లో వెలిగి ఉండాలని లేదు.అలాగే ఎక్కడో పెద్దగా వినిపించని ఈరోజునున్న కులాలు ఒకానొక కాలం లో వెలిగి ఉండవచ్చు.చరిత్ర ని పరిశీలిస్తూ పోతే దీనికి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకానొక సమయం లో, అంటే ఓ దశాబ్దం కిందట తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పట్టణం లో పర్యటించినప్పుడు మా మిత్రుని ఇంటి పక్కనే ఒక వ్యక్తి కనిపించాడు.ఉభయకుశలోపరి మాట్లాడుతూ తాము కరికాళ భక్తులు అనే కులానికి చెందినవారమని,మా జనాభా ఇప్పుడు చాలా తక్కువ ఉందని ,బిసి ల్లో ఉండటం వల్ల పెద్దగా ఏమీ ప్రయోజనం లేదని చెప్పుకొచ్చాడు.
చరిత్ర లో కరికాళుడి గురించి చదివి ఉండటం వల్ల ,ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగినప్పుడు పెద్దగా తెలీదని చెప్పి,ఐతే కరికాళుడనే ఎవరో మహానుభావుడి పేరు మీద నే మా కులం ఏర్పడినట్లు మాలోనే పెద్దలు కొంతమంది అనగా వినడమే తప్పా లోతు గా తెలియదని చెప్పాడు.
అందునా అంధ్ర లో కూడా కరికాళ కులస్తులు జనాభా పరంగా అన్ని జిల్లాల్లో లేరని,చాలా కొద్ది జిల్లాలోనే ఉన్నారని ఎక్కడ నుంచి ఎలా తమ కమ్యూనిటీ వచ్చిందనేది మా వాళ్ళలోనే చాలామందికి తెలీదని చెప్పుకొచ్చాడు.మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ పొన్నియన్ సెల్వన్ సినిమా వల్ల ఆ కమ్యూనిటి గుర్తుకు వచ్చింది.రాజేంద్ర చోళుడు అంటే కరికాళ చోళుని తాత గంగా తీరం వరకు రాజ్యాన్ని విస్తరించారు.ఆ తర్వాత దాన్ని చాలా ఏళ్ళ పాటు పాలించారు.ఏమో..మనకి తెలీని కోణాలు చరిత్రలో కప్పడిపోయి ఏవైనా ఉన్నాయేమో ఎవరికి తెలుసు..?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి