Pages

27, నవంబర్ 2022, ఆదివారం

మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని గమనిస్తే మంచిది


చిరంజీవి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలీని వారుండరు. మెగాస్టార్ గా అభిమానులచేత పిలువబడే ఈ ప్రముఖ సినీ నటునికి ఇటీవల IFFI ప్రారంభ సమావేశం లో ఇండియన్ ఫిల్మ్ పెర్సనాలిటి ఆఫ్ ద ఇయర్ గా అవార్డ్ నివ్వడం తెలుగు ప్రేక్షకులకి ముదావహం. ఐతే ఈ అవార్డ్ ని పుచ్చుకోవడం ద్వారా ప్రత్యేకించి ఆయనకి వచ్చే అవకాశాలు ఏమీ ఉండవు గాని మరోసారి జాతీయ స్థాయి లో చిరంజీవి పేరు వినబడుతుంది.

ఐతే ఆయన ఈ సందర్భంగా ఒకటి గుర్తుంచుకోవాలి.పెరిగిన వయసు ని,మారిన రూపాన్ని కూడా గమనించుకుని దానికి తగిన పాత్రల్ని ఎంచుకోవాలి.అమితాబ్ లాంటి వారు వాస్తవాల్ని గమనించి కొన్ని ఏళ్ళుగా అలాంటి వయసుకి తగిన పాత్రల్నే ఎంచుకుంటున్నారు.ఇటు రజినీ కాంత్ కూడా అలాంటి వాటిని ఎంచుకుంటున్నాడు.కమల్ హాసన్ సైతం విక్రం లాంటి సినిమా లో చేసింది అదే. అంత మాత్రం చేత ప్రేక్షకులు ఏమీ నిరాకరించరు పైగా మరింత ఆదరిస్తారు,సినిమా లో నిజం గా సరుకు ఉంటే.

గాడ్ ఫాదర్ గానీ దానికి ముందు వచ్చిన ఆచార్య గానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా విజయం సాధించకపోవడానికి అదే కారణం.ఎంత ఫోటోగ్రఫీ తో దాచాలని చూసినా వయసుని,దాని ప్రభావాన్ని దాచడం కుదిరే పని కాదు.అమ్మడూ కుమ్ముడూ లాంటి సాంగ్స్ కాకుండా జనల్లో నాలుగు మంచి విషయాలు చొచ్చుకునేలా కృషి చేస్తే బాగుంటుంది.పద్మభూషణ్ తెచ్చుకున్నారు.చాలినంత ధనం తెచ్చుకున్నారు.సినీ పరిశ్రమ లో ఒక స్థాయిని తెచ్చుకున్నారు. ఈ చివరి ఇన్నింగ్స్ లో ఆయన సినిమాల్లో కొన్ని మార్పులు వచ్చేలా కృషి చేస్తే బాగుంటుంది.   

1 కామెంట్‌:

  1. మంచి సలహా ఇచ్చారు. చిరంజీవి బాలకృష్ణ ఇద్దరూ వయసుకు తగిన పెద్ద తరహా పాత్రలు ఎంచుకుంటే బాగుంటుంది. వృద్ధాప్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా మాస్ పాటలు, స్టెప్పులు వేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. Even Nagarjuna and venkatesh have crossed 60 and should choose roles gracefully.

    రిప్లయితొలగించండి