Pages

22, డిసెంబర్ 2022, గురువారం

అవతార్ -2 (ద వే ఆఫ్ వాటర్) సినిమా గురించి నాలుగు మాటలు


 అవతార్ - 2 సినిమా ఈసారి ద వే ఆఫ్ వాటర్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చింది. దీని ప్రిక్వెల్ గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు.గ్రాఫిక్స్ మాయాజాలం తో సరికొత్త కథా విధానం తో, రకరకాల కలగాపులగం ప్రపంచ ఇతిహాసాల్ని గుర్తు చేస్తూ బ్రాండ్ న్యూ థీం నీళ్ళ లోపల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ దూసుకొచ్చింది. 350-460 మిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్ తో తయారైందని చెబుతున్నారు. ఈపాటికే ఈ పెట్టుబడి వచ్చేసి ఇంకా పైకి వెళుతోందని మీడియా భోగట్టా. ఈ సినిమా ని పిల్లలు పెద్దలు బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.దానికి తగినట్లు గా ఎక్కడా జుగుప్స గాని,అశ్లీలత గాని లేదు.అదొక మంచి విషయం. 

అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ గా చెబుతున్నప్పటికీ బాగా తరచి చూస్తే ప్రపంచం లోని అందరికీ నచ్చడం కోసం అన్నీ రకాల మషాళా దినుసులు వేశారు.సెంటిమెంట్ పండించడానికి కుటుంబ ప్రాముఖ్యత,కుటుంబం కలిసి మెలిసి ఉండటం లోని గొప్పదనాన్ని చెప్పారు.రకరకాల న్యూ ఏజ్ ఆయుధాల్ని కళ్ళకి ఇంపుగా పరిచయం చేశారు.ముఖ్యం గా ఆ చివరి సీన్ల లో బాగా పండాయి.కెమెరా పనితం సూపర్ అని చెప్పాలి.న్యూజీ లాండ్ కి వెళ్ళి మూడేళ్ళపాటు కొన్ని సీన్లు తీశారట.జేక్ సల్లీ అతని పరివారం తన ప్రదేశాన్ని వదిలి మెట్కాయింక రీఫ్ జాతి వారి దగ్గరకి రావడం, అక్కడికి క్వార్ట్చ్ అనే విలన్ తన గ్యాంగ్ తో వచ్చి దండెత్తడం ఈ ఎపిసోడ్ యొక్క వృత్తాంతం. విజయం మొత్తానికి జేక్ సల్లీ వర్గానిదే.

మరి చూద్దాం మూడో సీక్వెల్ ఎలా రానుందో..! ఈ సినిమా అందర్నీ బాగానే అలరించిందని అనాలి.పిల్లా పెద్దలతో సినిమా హాళ్ళు కిట్కిట లాడుతున్నాయి.ఓటిటి కంటే పెద్ద తెర మీదనే ఇలాంటి సినిమాలు బాగుంటాయి.దర్శకుడు జేంస్ కామెరూన్ తన క్రూ తో కలిసి విజయవంతమైన సినిమా ని అందించాడు.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి