Ilaya Thalapathi గా తమిళ్ లో పిలువబడే విజయ్ నటించిన "వారసుడు" సినిమా గురించి నాలుగు ముక్కలు రాయాలనిపించింది. చూసినంతసేపు మంచి వినోదాన్ని ఇచ్చింది.ఎక్కడా బోరు కొట్టలేదు.విజయ్ కూడా యాక్షన్ సన్నివేశాల్లోనూ,సెంటిమెంట్ సన్నివేశాల్లోనూ,సరదా సన్నివేశాల్లోనూ మంచిగా నటించాడు. ముఖ్యంగా బిజినెస్ ఎత్తుగడల్లో భాగంగా సినిమా అంతా నడిపించినట్లు అనిపిస్తుంది.మరి చాలా రివ్యూ ల్లో ఎందుకనో ఈ సినిమా కథ లో మూసదనం ఉందని,కొత్తదనం లేదని,విజయ్ నటన సో సో అని ఎందుకు రాశారో అర్ధం కాలేదు.
మన సోకాల్డ్ తెలుగు టాప్ స్టార్ ల సినిమా ల్లో ఎవరికి వారు పొలిటికల్ బిల్డప్పులు,లేనిపోని ఎలివేషన్ లు ఇచ్చుకోవడం తప్ప ఏమి నూతనత్వం ఉంటున్నదని..? కావాలనే విజయ్ సినిమాని తొక్కుతున్నారా అనిపించింది.ఒక సామాన్య ప్రేక్షకుడిగా నా డవుట్ అనుమానం మాత్రమే సుమా..!కావాలంటే సినిమా చూసి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు.కమల్,రజనీ,సూర్య, అజిత్ లాంటి వాళ్ళ రూపురేఖలు,నటన తెలుగు వారికి పట్టినట్లు మరి విజయ్ ఎందుకు క్లిక్ కావట్లేదో విచిత్రమే మరి.
ప్రస్తుతం తమిళ్ లో ఈ సినిమా వెర్షన్ అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ రాబడుతోంది. అజిత్ నటించిన తునివు కంటే కూడా.రజనీ కాంత్ తర్వాత మళ్ళీ అంత మాస్ హీరో గా సక్సెస్ అయిన విజయ్ మన తెలుగు లో మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోవడం ఒక గమ్మత్తైన విషయం. తమన్ సంగీతం ఫర్వాలేదు.ప్రకాష్ రాజ్ ,శరత్ కుమార్ ,జయసుధ వంటి వారు తమ పాత్రలకి న్యాం చేకూర్చారు.ఫోటోగ్రఫీ బాగుంది.వంశీ పైడిపల్లి ఒక సూపర్ సినిమా రూపొందించాడు అని చెప్పాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి