ఈ ఓటిటి లు అవీ వచ్చిన తర్వాత సామాన్య ప్రేక్షకుల్లో కూడా సినిమా జ్ఞానం బాగా పెరిగింది. ఎందుకని మళయాళం వంటి భాషల్లో చాలా తక్కువ బజెట్ తో మంచి కథలు రాసుకొని తీస్తున్నారు,వాట్ని మనాళ్ళు పెద్ద రేటు ఇచ్చి రీమేక్ రైట్స్ కొనుక్కోవడం చేస్తున్నారు అనేది అర్ధం అవుతున్నది. అయితే మన దగ్గర అవీ చీదేస్తున్నాయి,మనవైన కొన్ని మసాళాలు చొప్పించడం వల్ల.
వంశపు డైలాగులు,నేను లేస్తే మనిషిని కాదు అనే రాజకీయ డైలాగులు విని విని చూసి చూసి తెలుగు సినిమా అంటే ఉన్న గౌరవం పోతున్నది.అసలు అనగూడదు గాని మన ఆడియన్స్ లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ బర్రె గొడ్ల యవ్వారం లా ఉంది...హీరోల్ని అభిమానించే తీరు...మా కులపు వాడు ఐతే చాలు ఎయ్ ...ఎయ్...నా రాజా సినిమా ఇరగ ఉంది బ్రదర్ అంటూ రివ్యూ లు విరగదీసి రాయడం,చెప్పడం ఒకటి. ఇక యూ ట్యూబ్ చానళ్ళు గురించి చెప్పేదే లేదు.
ఇది చాలదన్నట్లు భారత్ దాటి ,అమెరికా సినిమా హాళ్ళ లో కూడా నానా రభస చేస్తూ తెలుగు వాళ్ళు అంటే ఈ టైప్ వాళ్ళా అనుకునేట్లు చేస్తున్నారు. సుత్తి అంతా ఎందుకు గాని ఈమధ్య చిరంజీవి,బాలకృష్ణ ల రెండు కొత్త సినిమాలు చూసిన తర్వాత వీరిద్దరు కొంత కాలం సినిమాలు తీయకుండా ఉంటే మంచిది అనిపించింది. తెలుగు వాళ్ళకి గాని,కళల కి గాని వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పటికే వాళ్ళు చేయవలసింత కళాసేవ చేసి తరించారు.
బాగా చెప్పారు, కానీ వాళ్ళెక్కడ మారతారు.
రిప్లయితొలగించండిఏమనుకోకండి గానీ మీ ఈ బ్లాగ్ పేజ్ కలర్ స్కీమ్ మార్చితే చదివే వారి కళ్ళకు కొంత సౌకర్యంగా ఉంటుంది. మీ ఇష్టం అనుకోండి గానీ తెల్ల బాక్ గ్రౌండ్ మీద నలుపు గానీ, నీలం గానీ అయితే బాగుంటుందని ఒక ఉబోస.
చాలా బాగా చెప్పారు. 100 % agree with you.
రిప్లయితొలగించండి