మొత్తానికి ఆస్కార్ అవార్డ్ ని తెలుగు సినిమా చేజిక్కించుకుంది. నాటు...నాటు... అనే పాటతో. ఏదేమైనా ఆస్కార్ కమిటీ వాళ్ళు మహా చతురులేనండోయ్...లేకపోతే మరేమిటి..? మన రాజమౌళి సినిమాలు అతుకుల బొంతలని,అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీసేసి తన సినిమాలు తీస్తాడని క్రిటిక్స్ బాహుబలి టైం లో అన్నారు,మళ్ళా RRR టైం లోనూ అన్నారు. అయితేనేం "ఒరిజినల్ సాంగ్" అనే కేటగిరి లో రెండు ఆస్కార్ లు వచ్చాయి. ఒకటి కీరవాణి కి,మరొకటి చంద్రబోస్ కి. అభినందనలు చెప్పాల్సిందే...సాటి తెలుగువాళ్ళకి ఆస్కార్ వచ్చినందుకు..! కానీ ఏదో లోటు లోపల..ఇంకా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి తెలుగు లో ,వాటిలో కూడా ఏదో దానికి వచ్చి ఉంటే బాగుండు.
అప్పటికీ తమ్మారెడ్డి భరద్వాజ అనే ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూనేఉన్నాడు.80 కోట్లు ఖర్చు పెట్టారని,లాబీయింగ్ లు చేశారని.ఏం చేస్తాం మరి.లోకం పోకడ అలా ఉంది.కానివ్వండి మేనేజ్మెంట్ చేసే కళ కూడా సామాన్యమా..? దానిలోనూ ఎంతోమంది పోటి పడే ఉంటారు,కాని నెగ్గేమా లేదా అది కత. కాని మంచి సంగీతానికి ఇంకా సాహిత్యానికి పరాకాష్ట కేవలం ఈ సాంగ్ మాత్రమే అని ఇక్కడే నిలిచిపోతే అంతకి మించిన అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఇంతకు ముందు ఇదే కేటగిరి లో 2009 లో స్లండాగ్ మిలియనీర్ సినిమా కి గాను ఏ.ఆర్.రెహమాన్,గుల్జార్ లకి వచ్చాయి.చూద్దాం...ఇంకా ముందు చూద్దాం. మరిన్ని ఆస్కార్ లు తెలుగు చిత్రసీమ కి దక్కుతాయని ఆశిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి