Pages

1, అక్టోబర్ 2023, ఆదివారం

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే .....

 అప్పుడప్పుడు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. చంద్రబాబు జైలు కెళతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అలా అనిపించడం సహజం. న్యాయ వ్యవస్థ లో తిరుగులేని పట్టు కలిగి ఇదిగో ఈ విషయం లో దొరికిపోతాడు అనుకునేలోపు దాంట్లోచి బయటకి రాగలగడం మనం అనేకసార్లు చూడలేదా..? స్వతహగా ఎన్ టీ ఆర్ లాగా గొప్ప స్పీచ్ లు అవీ ఇచ్చే చరిష్మా లేకపోయినా తన మనుషుల్ని ఎక్కడ ప్లాంట్ చేయాలో అక్కడ ప్లాంట్ చేసి కార్యాల్ని గంధర్వుల మాదిరి గా మూడో కంటికి తెలియకుండా నడిపించడం బాబు గారి చతురత కి నిదర్శనం.

ఆయన అరెస్ట్ అయిన తర్వాత బాల కృష్ణ గారి ధోరణి సినిమా మూస లోనే తప్పా మారకపోవడం చిత్రం. మమ్మల్ని ఏమీ పీకలేవు అంటూ బూతులు అందుకోవడం అసెంబ్లీ లో అలాంటి చేతి సైగలు చేయడం ఆయన రాజకీయ అపరిపక్వత కి నిదర్శనం. ఆల్ రెడీ అక్కడ పీకి చూపించాడు ప్రత్యర్థి ...అయినా ఏం పీకుతావు అంటూ మాట్లాడటం ఏమిటో అర్థం కావట్లేదు. ఇక పవన్ పయనం ఏమిటో గందరగోళం గా ఉంది.

రాజకీయ క్షేత్రం లో పవర్ ఎప్పుడూ ఒకే వైపు ఎల్లకాలం ఉండదు. గతం లో జగన్ ని అరెస్ట్ చేయడం , అతని కుటుంబాన్ని వేధించడం కళ్ళున్న ప్రతి ఒక్కరు చూశారు. ప్రస్తుతం జరిగింది దానికి టిట్ ఫర్ టాట్ లాంటిది తప్పా మరొకటి కాదన్నట్లు సామాన్యుడు భావిస్తున్నాడు. అందుకనే పవర్ చేతి లో ఉన్నప్పుడు ఎదుటి పక్షాన్ని ఒక స్థాయి దాటి వేధించరు నిజం గా తెలివైనవాళ్ళు. ఎందుకంటే పవర్ చేతులు మారినపుడు పదింతలై వెనక్కి తిరిగి వస్తుంది. తల్చుకుంటే సోనియమ్మ ని,రాహుల్ బాబు ని జైల్లో పెట్టించలేరా మోడీ షాలు...కానీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు పవర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదని.      

3, సెప్టెంబర్ 2023, ఆదివారం

కొన్ని టివి. చానెళ్ళ లో ముస్లిం ప్రేమికుని పేరు కూడా వేయడం లేదు. ఎందుకు..? ఎవరైనా నేరస్థుడేగా ...ఎందుకా భయం..?

 కోరుట్ల ఉదంతం కొన్ని ప్రశ్నల్ని మన ముందు ఉంచింది. దీప్తి,చందన ఇంకా ముస్లిం ప్రేమికుడు. ముస్లిం ప్రేమికుడు, సోదరి చందన ఇద్దరు పారిపోతూ దీప్తి అనే అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయారు. కొన్ని టివి. చానెళ్ళ లో ముస్లిం ప్రేమికుని పేరు కూడా వేయడం లేదు. ఎందుకు..? ఎవరైనా నేరస్థుడేగా ...ఎందుకా భయం..?


ఇదే ఉదంతం రివర్స్ లో జరిగింది అనుకోండి...ఒకసారి ఊహించుకొండి...ఏం జరిగి ఉండేది..? ఖచ్చితం గా ఆ హిందూ కుర్ర ప్రేమికుడి ని వెంటాడి చంపేవారు. ఏమైనా అంటే అది మా మత సంప్రదాయానికి విరుద్ధం అంటారు. దాన్ని కొంతమంది హిందువులు కూడా సమర్థిస్తారు. 


సోషల్ మీడియా లో చూస్తే ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఆ కుర్రాడు చేసింది తప్పు అన్న పాపాన పోలేదు. ఏ నాయకుడు బహిరంగంగా ఖండన చేసినట్లు లేదు. ఎందుకింత హిపోక్రసీ..?


హిందువులకి మత భావన లేదు ...ఇదొక కారణం.

అసలు తమని ఓ మతం కింద జమ కడతారనే విషయం కూడా కొంతమందికి తెలియదు.


ఎవడెట్లా పోతే నాకేంటి...అనుకునే తత్వం. ఇంకా ప్రమాదకర విషయం. కొంతమంది దళితులు కూడా ముస్లిం ల చేష్టల్ని సమర్థించడం. సవర్ణ హిందువులు ...మిమ్మల్ని ఆ రోజుల్లో అలా చేశారు కాబట్టి మాతో కలవండి అని వాళ్ళని తమ వేపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.


హిందూ మతం లో ఉన్న జాడ్యాలపై నిస్సందేహంగా పోరాడవచ్చు. తప్పు లేదు. హిందూ మతం ఓ వెయ్యి ఏళ్ళ క్రితం ఉన్నట్లు ఇప్పుడు లేదు. ఇంకా మార్పులకి లోనయినా వచ్చిన ముప్పు లేదు. కానీ శత్రువు పక్షం లో ఉండి సొంత ఇంటి వారిపై పోరాడతా అంటే ఎలా..?


సవర్ణ హిందువులు తప్పనిసరిగా ఇకనైనా తమ అభిజాత్యాల్ని తగ్గించుకోవాలి. రకరకాల కారణాలతో దూరమైన వర్గాల్ని చేరదీయాలి. అప్పుడే హిందూ మతం కి బలం.  

25, ఆగస్టు 2023, శుక్రవారం

"జైలర్" సినిమా పై నా అభిప్రాయం


రజనీకాంత్ లో మేజిక్ మళ్ళీ ఈ సినిమా ద్వారా బయటపడింది. ఈ మధ్య సరైన హిట్ లేక ఉన్న ఆయనకి సమయానికి ఓ హిట్ పడింది. ఇదేదో అనాలోచితం గా వచ్చింది కాదు. తన వయసు కి తగిన పాత్ర ని ఎంచుకున్నాడు. అంతే గాక భుజ బలం తో గాకుండా బుద్ధిబలం తో ఎలా ఓ సీనియర్ సిటిజన్ తనకి ఎదురైన సవాళ్ళను అధిగమించాడు అన్నది దీంట్లో ప్రధాన విషయం. అందుకే చిన్నా,పెద్దా అందరూ సినిమా కి కనెక్ట్ అయ్యారు.

సన్నివేశాల్ని తీర్చిదిద్దటం లో సహజత్వానికి దగ్గరగా ఉండటం అనేది తమిళ దర్శకుల్లోని గొప్ప ప్లస్ పాయింట్. అది ఈ సినిమా లో మరింత బాగుంది. సినిమా మొదట్లోనే రిటైర్ అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో బాగా చూపెట్టడం జరిగింది. మనవడి తో చిన్న చిన్న యూట్యుబ్ వీడియోలు తీసుకోవడం అనేది అందర్నీ అలరిస్తుంది.మామూలు గానే తన వయసు కి అది నప్పింది. యోగిబాబు కేరక్టర్ లాంటి వారు ఇంచు మించు ప్రతి వీథి లోనూ ఉంటారు.పైగా ఆ హాస్యం చాలా మృదువు గా గిలిగింతలు పెడుతుంది.

ఇక ప్రధాన విలన్ వినాయగం కలకాలం గుర్తుండేలా చేశాడు.చిన్నా చితకా పాత్రలు వేసే అతగాడి లో ఇంత కోణం ఉందని కనిపెట్టిన దర్శకుని అభినందించాలి.మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇద్దరూ తమ ప్రత్యేక పాత్రల్లో విరగదీశారు.చప్పట్లు పడ్డాయి. ఆయా భాషల్లో కూడా వీరి ప్రభావం బాగా ఉంటుంది.సందేహం లేదు. డైలాగ్స్ బావున్నాయి. ఫైటింగ్ సన్నివేశాల్ని చాలా విన్నూత్నం గా తీశారు.కొత్తదనం అనేది సినిమా చూసే ప్రేక్షకుడు ఫీలవుతాడు. మెంటల్ హాస్పిటల్ సన్నివేశాలు సైతం కడుపుబ్బా నవ్విస్తాయి. 

సినిమా కి డైలాగులు ప్రాణం పోశాయి. అదే విధం గా క్లైమాక్స్ లో వచ్చే కొడుకు ద్రోహం చేసే సీను ఎవరూ ఊహించలేరు. దానికి శిక్ష ని కూడా వెరైటీ గా తీశారు. సినిమా ఏ దశ లోనూ బోర్ కొట్టకుండా నడిపించడం ఈ సినిమా జైత్ర యాత్ర కి తోడ్పడింది.తీహార్ జైలు సన్నివేశాలు అదరహో అనిపించాయి.సంగీతం ఫర్వాలేదు. కథా, కథనం ఈ సినిమా కి నిజమైన హీరోలు.రమ్యకృష్ణ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.ఏది ఏమైనా రజనీకాంత్ నిస్సహందేహం గా ఈసారి తెలివి గా హిట్ కొట్టాడని చెప్పాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ని అభినందించకుండా ఉండలేము ఇటువంటి ఎంటర్టైనర్ ఇచ్చినందుకు. 

--- EM

2, ఆగస్టు 2023, బుధవారం

Bawaal అనే హిందీ సినిమా చూసి మతిపోయింది.

 బవాల్ (Bawaal) అనే హిందీ సినిమా ని చూడటం జరిగింది. 

అమెజాన్ ప్రైం ఓటిటి లో ఇటీవల రిలీజ్ అయ్యింది. వరుణ్ ధావన్,జాన్వి కపూర్ నటించారు గదా అన్నట్టు చూశాను. ఎంత మతి లేని స్టోరీలు పెట్టి సినిమాలు వండుతున్నారు అని నవ్వు వచ్చింది. బాగా రిచ్ గా విదేశాల్లో తీశారు కాని అర్థం పర్థం అనేది ఉండాలా..? హీరో ఏదో బాగా ఉన్నవాడిలా బిల్డప్ లు ఇస్తుంటాడు. కాని హైస్కూల్ లో టీచర్ గా చేస్తుంటాడు.అదీ సోషల్ టీచర్ గా సుమా.


విచిత్రం ఏమిటంటే హిట్లర్ గురించి,ప్రపంచ యుద్ధాల గురించి హీరో కి ఏమీ తెలీదు,పిల్లల తో పాఠాలు చెప్పిస్తూ బిల్డప్ ఇస్తుంటాడు. అసలు ఈరోజుల్లో అలాంటి టీచర్ ని పెట్టుకునే స్కూల్ ఎక్కడన్నా ఉంటుందా..?పైగా ఆ స్కూల్ లో ఎం.ఎల్.ఏ. కొడుకు చదివే రేంజ్ ఉన్న స్కూల్. ఎంత వెకిలితనం తో తీస్తున్నారు సినిమాలు. హీరోయిన్ కి ఫిట్స్ ఉంటాయి. ఆ విషయం పెళ్ళికి ముందే చెబుతుంది హీరోయిన్ అయినా పెళ్ళి అయిన తర్వాత కూడా హీరో ఆమెని ద్వేషిస్తూంటాడు. ముందే పెళ్ళి కి నో చెప్పొచ్చుగా. 

ఇక పిల్లలతో గొడవ వచ్చి వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వడానికి జర్మనీ వెళతాడు హీరో. పైగా అక్కడ యూదుల్ని చంపడానికి  హిట్లర్ నిర్మించిన గ్యాస్ చాంబర్(ఆశ్వీజ్)లు చూస్తూ కొన్ని జంటల జీవితాలు వాటిలాగా ఉంటాయని పోల్చడం ఏమిటో అర్థం కాదు. దానికీ దీనికీ లంకె ఏమిటో తెలియదు. ఈ మధ్య కాలం లో ఇంత మతి లేని కత ని ఎక్కడా చూడలేదు. గతం లో నితీష్ తివారీ దంగల్,చిచోర్ లాంటి మంచి సినిమాలు తీసినా మరి ఈసారి ఏమయ్యిందో తెలియదు.      

12, జులై 2023, బుధవారం

మహిళలు ఇలా ఉన్నారు మన దేశంలో...


 మహిళా సాధికారత అనే మాట తరచు గా వింటూ ఉంటాము. పేపర్ల లో,టీవి ల్లో,నాయకుల ప్రసంగాల్లో ఎక్కడ చూసినా అదే. కాని గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు.యుపిఎస్సి లోనూ,ఇతర పరీక్షల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నా నిర్ణాధికారం ఉండే పోస్టుల్లోకి రావడం లేదు.మొత్తం జనాభా లో దేశం లో 48 శాతం స్త్రీ ల జనాభా ఉంది. కేవలం 25 శాతం మాత్రమే పనిచేసే వర్గం లో ఉన్నరు.

ఇది అంతా CMIE వారి లెక్కల ప్రకారం చెబుతున్నదే. మొత్తం పనిచేయగల వారి స్త్రీల జనాభా లో 94 శాతం మంది అన్ ఆర్గనైజ్డ్ రంగాల్లో ఉన్నారు.పార్లమెంట్ ని తీసుకున్నా అంత ఆశాజనకం గా ఏమీ లేదు. 542 మంది లోక్ సభ సభ్యుల్లో కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు.అలాగే రాజ్యసభ లో తీసుకున్నా,224 మందికి గానూ 24 మంది మాత్రమే ఉన్నారు.ఇదంతా అక్టోబర్ 2021 లో తీసిన లెక్కలు.

అంతర్జాతీయ సంస్థలు ఈ గణాకాల పట్ల పెదవి విరుస్తున్నాయి. ఇంకా స్త్రీల శాతం అన్ని రంగాల్లో పెరగవలసిన అవసరాన్ని చెబుతున్నాయి.మనదేశం తో పోలిస్తే అనేక యూరపు దేశాల పరిస్థితి మిన్నగా ఉంది.అయితే ఎన్నో తరాల నుంచి వారికి,మన దేశ పరిస్థితికి తేడాలు ఉన్నాయి గదా అనవచ్చు.అదీ నిజమే అయినప్పటికి చిత్తశుద్ధి తో కృషి చేస్తే స్త్రీల శాతం అన్ని రంగాల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.

30, జూన్ 2023, శుక్రవారం

ఆదిపురుష్ అనబడే సినిమా ....

 ఆదిపురుష్ అనబడే సినిమా ఈ రకంగా తీయాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. అది ఇతిహాసమే బట్ ఇప్పటిదాకా జనాల మనసుల్లో ఉన్న ఆహార్యం దీంట్లో ఉండదు. రోమన్ల శైలి. నడుము కి కట్టిన దట్టీ దగ్గర్నుంచి,జులపాల వరకు.వస్త్రాల దగ్గరనుంచి మొహం లో పెద్దగా హావభావాలు లేని స్థితి. రామాయణం కాదు అంటారు.మళ్ళీ భజరంగ్ గారికి ఓ సీటు వదిలెయ్యాలంటారు.


ఇక రావణాసురుని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆ పది తలలు ఎంత కృత్రిమం గా ఉన్నాయో.నిజంగా ఆ వాల్మీకీ మహర్షి కనక ఉంటే ఇలా అంటాడాయన. నా పాత్రల్ని ఎంత అపభ్రంశం చేశారురా బాబూ.చేసి మళ్ళీ దీనికీ రామాయణం కి సంబంధం లేదంటారు.భజరంగ్ పలికే సినిమాటిక్ డైలాగ్ లు.ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.   

21, మే 2023, ఆదివారం

బిచ్చగాడు 2 సినిమా పై నా అభిప్రాయం

 ఒక్కమాటలో చెప్పాలంటే ఒకసారి చూడవచ్చు. మరీ సూపర్ కాదు. మరీ చెత్త అనలేము. ఎంతోకొంత లేనివాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మీద ఓ సాఫ్ట్ కార్నర్ వచ్చేలా సినిమా తీసినందుకు విజయ్ ఆంటోనీ ని అభినందించాలి. బిచ్చగాడు మొదటి పార్ట్ లో తల్లి కొడుకు సెంట్ మెంట్ బాగా వర్కవుట్ అయింది. అలాగే అన్నీ బాగా కుదిరి సూపర్ హిట్ అయింది. అది ఇచ్చిన ఊపు లో దానికి సీక్వెల్ గా ఇది తీశారు.

అయితే దానికి దీనికి కథ పరంగా పెద్దగా పొంతన లేదు. ఇది మొత్తం కార్పోరెట్ కుటుంబం,కుట్రలు,ఇంకా ఇంకో వైపు అన్న చెల్లి సెంట్ మెంట్.విజయ్ ఆంటోనీ మరియు నాయిక కావ్య థాపర్ బాగా చేశారు.అయితే కొన్ని సన్నివేశాలు మరీ లాగదీసినట్లు అనిపించాయి.ముఖ్యంగా చిన్నప్పటి సెంట్ మెంట్ సీన్లు కొన్ని తగ్గించవలసింది. చూసేవాళ్ళకి కొద్దిగా రిలీఫ్ వుండేది.కాని చివరకి వచ్చేసరికి సెంట్మెంట్ తో కన్నీళ్ళు వచ్చేలా చేశాడు.

ప్రతి ఉన్నవాడు ఎంతో కొంత ఈ సినిమా లో చెప్పినట్లు అంత స్థాయి లో కాకపోయిన ఏంతో కొంత ఇతరుల గురించి ఆలోచించి తోచింది చేస్తే సమాజం లో చాలా బాధలు పేదవారికి ఉండవు.అది కన్విన్సింగ్ గా చెప్పిన దర్శకుడు విజయ్ ఆంటోనీ అభినందనీయుడు.ఆ కోణం లో అతడిని మెచ్చుకోకుండా ఉండలేము. బ్రెయిన్ మార్పిడి ఆసక్తి గానే ఉంది గాని కొన్ని సందేహాలు రాకమానవు. బిచ్చగాడు రిచ్ మేన్ స్టేజ్ కి వచ్చిన తర్వాత తన పలుకుబడి,డబ్బు తో తన చెల్లిని ఈజీ గా వెతికవచ్చు గదా.మళ్ళీ తను బిచ్చగాడి గా మారడం ఏమిటి అనిపిస్తుంది.

ఏది ఏమైనా ఓ సారి చూడవచ్చు.సంగీతం,ఎడిటింగ్,నిర్మాత,దర్శకత్వం ఈ బాధ్యతల తో బాటు హీరో గా కూడా నటించి విజయ్ ఆంటోనీ కొంత మేరకు విజయవంతం అయ్యాడనే చెప్పాలి.దేవ్ గిల్,రాధా


రవి ఇంకా ఇతరులు బాగా చేశారు.డైలాగులు కూడా ఫర్లేదు.నిడివి కొన్ని చోట్ల తగ్గిస్తే సినిమా ఇంకా హిట్ అయ్యి ఉండేది.చివరి సన్నివేశాల్లో కన్నీళ్ళు రాని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.