Pages

22, జూన్ 2013, శనివారం

"యాక్షన్ 3డి" సినిమా పై నా రివ్యూ.!



అసలు సినిమాకి టైటిల్ కి సంబందం ఏమిటో అర్ధం కాదు.3డి ఎఫెక్ట్ కూడా పెద్దగా కనబడదు.అసలీ కామెడీ సినిమాకి అది శుద్ధ దండుగ.నరేష్కున్న కామెడి మార్కెట్ని cash చేసుకోవడానికి తీసినట్టుంది. మిగతా ముగ్గురు కామెడీ హీరోలు కొంత పరవాలేదు.సినిమా కధలోనే ఒరిజినాలిటి లేదు.The hangover అనే ఇంగ్లీష్ సినిమా నుండి ఇతివృత్తాన్ని తీసుకున్నారు.పోనీ nativity తగ్గట్టుగా మార్పులు చేశారా ..అదీ లేదు.ఇలాంటి వాటిల్లో తమిళుల్ని చూసి నేర్చుకోవాలి.

మాట్టడితే తొడల మధ్యలో తన్ని కామెడి గా ఫీల్ అవడం అనేది ఇంగ్లీష్ సినిమాల తరహా కామెడి.ఇక్కడది ఎబ్బుట్టుగా వుంటుంది.ప్రేక్షకులు కూడా సినిమాని అక్కడే తన్నే అవకాశం వుంది.సినిమా కధ సాగతీత అసహజంగా..బోరుగా వుంది. ఎమ్మెస్ నారాయణ కామెడి కూడా చీప్ గా వుంది.సంగీతం అంతమాత్రమే. స్నేహా ఉల్లల్ సెక్సీగా వుంది.ఇలాంటి వాటిని నమ్ముకునే మనాళ్ళు సినిమాలు అమ్ముకునేది.మరి క్రిఏటివిటీ లేనప్పుడు అంతే..!  

                 Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి