Pages

14, జులై 2013, ఆదివారం

సింగం-2 సిన్మా పై నా రివ్యూ.......!



సూర్య  నటన యాంగ్రీ పోలిస్ మేన్ గా అలరించే విధంగా వుంది.అయితే కొంత శబ్ద కాలుశ్యం కూడా బాగానే వుంది.డైలాగులు స్పీడ్ గా ..యమ సౌండ్ తో వున్నాయి.సినిమాని ఎక్కడ పెద్దగా బోరు కొట్టకుండా దర్శకుడు నడిపించడం  బాగుంది.జాతీయ గీతం గురించి...ప్రేమ గురించి ఇచ్చిన డెఫినిషన్స్ జనాలని అలరిస్తాయి.మరీ రేషనల్ గా వెళితే కొన్ని లూప్ హోల్స్ వున్నాయి.  కాబట్టి అవి ఆలోచించకపోతే ఎంజాయ్  చేయొచ్చు.

సినిమాలో వుప్పు తయారు చేసే తూత్తు కుడి(తమిళనాడు) లో కొన్ని సన్నివేశాలు తీశారు.అవి లొకేషన్స్ బాగున్నాయి.అనుష్క పాత్రకి న్యాయం చేసింది.హన్సిక ఓ.కే.

సూర్య మీదనే సినిమా భారం అంతా వుంది.వివేక్,సంతానం పరిధి మేరకు చేశారు.బ్రిటిష్ నటుడు డేనీ సపానీ మెయిన్ విలన్ గా చేశాడు. సరే ఒక కొత్తదనం గా వుంది.మన హీరో ఆ నైజీరియా నల్లవాణ్ణి (మనం ఎంతో కొంత నలుపే అది గుర్తుంచుకోవాలిక్కడ) ఆ దేశానికి వెళ్ళి పిచ్చ కొట్టుడు కొడతాడు.

ఆ మధ్య ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక ఢిల్లి పోలిస్ అధికారి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం నైజీరియన్ లను తీసుకురావడానికి ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులు అసలు వెళ్ళరట (మన దేశం లో సంగతే చెప్తుంటా..!) ఎందుకంటే మన వాళ్ళని ఇద్దరు లేదా ముగ్గురుని ఈజీ గా కొట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తారట వాళ్ళు.

చాలా మంది అంత మంచి ధృఢకాయులుగా వుంటారు.మరి తినే గేదె మాంసం లోనే ఆ శక్తి వుందేమో మరి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లో ఒకటి రెండు పాటలు బాగున్నాయి.వెరసి సిన్మాకి డబ్బులు వచ్చే అవకాశం వుంది..దిగులు లేదు.ఈ మాత్రమైనా ఈ మధ్య తెలుగు సినిమాలు ఏమి వచ్చి ఏడ్చాయని..!ఏమైనా కమల్ హాసన్ ,రజనీ కాంత్ ల తరవాత మళ్ళీ ఆ రేంజ్ లో తెలుగు వాళ్ళకి నచ్చిన హీరో సూర్యా నే అనవచ్చు.
                                                         Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి