Pages

11, జులై 2013, గురువారం

బలుపు సినిమా పై నా రివ్యూ..!



రవితేజా కి ఒక హిట్  పడినట్టే చెప్పుకోవచ్చు ఈ సినిమాతో ..! సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా నడిచింది.స్టోరీ ఈసరికే చాలా మందికి తెలిసిపోయింది కాబట్టి దాని జోలికి వెళ్ళి ఎక్కువ బోరు కొట్టను.ఫక్తు ఎంటర్టైన్మెంట్ మూవీగా చెప్పాలి.కొన్ని ట్విస్టులు బాగానే పండాయి.భాషా సినిమా లెవెల్లో ఒక గతం హీరోకి వుంటుందని మనం వూహించము.

లక్ష్మీరాయ్ డాన్స్ విరగదీసింది.అంజలి బాగానే చేసింది.మొత్తానికి పి.కె. అభిమానుల్ని కూడా అలరించే ప్రయత్నం చేశారు.ప్రకాష్ రాజ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.తమన్ సంగీతం లో  కొన్ని పాటలు బాగున్నాయి.

అక్కడక్కడ బూతు డైలాగులు దొర్లాయి.బ్రహ్మానందం కామెడి కొన్ని చోట్ల బాగుంది.శ్రుతి హాసన్ పరవాలేదు.అయితే ఒక మామయ్య..కోడలు ఆ విధంగా జనాలని బకరాల్ని చేయడం ..ఆడుకోవడం..ఎక్కడైనా చూశారా అని మనం ఎంతమాత్రం ప్రశ్నించరాదు.
                                    Click here for more
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి