Pages

7, జులై 2013, ఆదివారం

నేటి ఈ-టీవి స్వరాభిషేకం పై నా రివ్యూ..!



నేడు ఈ టీవి లో ప్రసారమైన ఆ కార్యక్రమం బాగుంది.మంచి మధురమైన పాటల్ని ఎన్నుకున్నారు.పాడేవాళ్ళు కూడా హేమా హేమీలే..!ఎంచడానికేమీ లేదుగానీ బాగా గమనిస్తే ఈ మధుర గీతాలన్నీ ఇంచుమించు అన్నీ చాలా మటుకు తమిళ అనువాద చిత్రాల లోనివే..లేదా లబ్ద ప్రతిష్టులైన తమిళ సంగీత దర్శకులు స్వరపరచినవే..! అదీ విచారించవలసిన విషయం.

తెలుగు సినిమాల్లో ఎంతసేపు అర్ధం కాని రణగొణ ధ్వని యే తప్పా మధురత ఎక్కడిది..?హేరిస్ జయరాజ్,రెహమాన్,ఇంకా ఇళయరాజా లాంటి వాళ్ళు western style లో పాటని చేసినా ఒక మెలోడి దాంట్లో వుంటుంది. అది మిస్సవదు.మరి మన దగ్గర అలా రావు అంటే మన నిర్మాత,దర్శకులుగాని..హీరోలు గాని పైకి రిచ్ గా కనిపించడమే తప్ప సరైన taste  వున్న వ్యక్తులు కారు.ఒకవేళ ఎవరైనా వున్నా వాళ్ళది అరణ్య రోదనే..!వస్త్రాల్లోనూ..ఫేషన్ల లోనూ..పటాటోపంగా కనిపిస్తారే తప్పా లోపల education అనేది వుండదు.

ఒక కొత్త బాణీని..ఒక కొత్త టాలెంట్ గాని తెలుగు వాళ్ళలో వుంటే పరిచయం చేయాలంటే ఒప్పిచావదు. కులం..ప్రాంతం ఇల్లాంటి సొల్లు విషయాల మీద వున్న శ్రద్ధ ఇంకోదాని మీద వుండదు.ఎవడైనా ఖర్మగాలి ఒక తమిళ సినిమాని హిట్ చేస్తే   ఇక వారి చుట్టు చేరి వారు కోరినంత సమర్పించుకుంటారు.

మన మాస్ హీరోలు తెలుగు సినిమా పాలిట....సృజనాత్మకత పాలిట కొరివి దయ్యాలు.

1 కామెంట్‌:

  1. తెలుగువారికి పొరుగింటి పిల్ల పుల్లకూర రుచి!మనకు సంగీత దర్శకులు,కథానాయికలు వేరేవేరే భాషలనుంచిరావాలి!అయితే మళ్ళీ ఒక సాలూరి రాజేశ్వరరావు,ఒక సావిత్రి ఎలా వెలుగులోకి వస్తారు!

    రిప్లయితొలగించండి