Pages

10, ఆగస్టు 2013, శనివారం

రేపొద్దున్న ఐశ్వర్యా రాయ్ అయినా అంతే...!



పెళ్ళయిన తర్వాత ఒకళ్ళనో..ఇద్దరినో పిల్లలని కనేసిన తరవాత మళ్ళీ నటీమణులు పూర్వవైభవం కోసం తపిస్తుంటారు.విచిత్రం ఏమంటే మళ్ళీ అదే పూర్వ వైభవం పొందలేమని తెలిసినా తమ ప్రయత్నాలు తాము చేస్తుంటారు.మన తెలుగు తెర పై సిమ్రాన్ ఒకప్పుడు ఎంత వెలిగిపోయిందో అందరికి తెలుసు.పెళ్ళి అయ్యి ఒక  పిల్లాడు పుట్టిన తరవాత చాలా ప్రయత్నించింది...మళ్ళీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని..పాపం సెకండ్ ఇన్నింగ్స్ లో అంతా చాలామటుకు వదిన లాంటి పాత్రలు ఆఫర్ చేస్తుండడంతో మళ్ళీ డ్రాప్ అయినట్టుంది. కొన్ని టి.వి.సీరియళ్ళలో కనిపించింది..ఇప్పుడు ఎక్కువ కనిపించడంలేదు. 

అందుకే చాలామంది పెళ్ళయినా బయటికి తెలియనివ్వరు.కొంతమంది వాస్తవాల్ని గ్రహించి తల్లి,వదిన పాత్రలతో సర్దుకుపోతుంటారు.అక్కడ హిందీలో ప్రస్తుతం మాధురీ దీక్షిత్ కూడా కుస్తీ పడుతోంది.ఒక ఐటం సాంగ్ కూడా చేసింది ఈమధ్యనే.అబ్బా..తల్లి అయినతరవాత కూడా బాగానే చేసిందే అంటారు తప్ప మళ్ళీ పునర్వైభవం వస్తుందంటే కష్టమే..!

రేపొద్దున్న ఐశ్వర్యా రాయ్ అయినా అంతే...! మన భారతీయ ప్రేక్షకులు అటుంచి...నిర్మాత,దర్శకులకి కూడా పెద్దగా ఆసక్తిగా వున్నట్టు కనిపించరు ఇలాంటి సెకండ్ ఇన్నింగ్స్ భామల విషయంలో..!  Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి