ఈ చర్చ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మరింది. రెండు రోజుల క్రితం మంత్రి రాం రెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో వర్గ పోరుకి దారి తీసింది.తెలంగాణా ఏర్పడబోతున్న ఈ కీలక సమయంలో ఇంకా తాము తెలంగాణేతరురాలైన రేణుకా చౌదరిని మొయ్యలేమని..జై తెలంగాణా అన్న కార్యకర్తలని ఆమె తన్నించారని..ఉద్యమాన్ని ఇన్స్ టేంట్ కాఫీ తో పోల్చి అవమానించారని దుయ్యబట్టారు.మాట్లాడితే తాను జిల్లా ఆడబిడ్డనని చెప్పుకునే ఆమె ఇక్కడ ఏ ఊరిలో జన్మించారో,ఆమె తల్లితండ్రులెవరో చెప్పాలని సవాల్ చేశారు.దాంతో ఆమె వర్గీయూలు దానికి ధీటైన వ్యాఖ్యలు చేశారు.సోనియా గాంధి మాట మేరకు తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పారు.
ధైర్యముంటే ఈ 21 న జరిగే మీటింగ్ కి రాకుండా ఆపుకొండని ప్రతి సవల్ విసిరారు.నిన్న రాం రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు దామోదర్ రెడ్డి ఖమ్మం వచ్చి తాము సవాలుని స్వీకరిస్తున్నామని..మహిళ అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రేణుకా చౌదరి ని తాము ఉపేక్షించబోమని అన్నారు.
రాజ్యసభ కి నామినేషన్ వేసే సమయం లో ఆమె విశాఖపట్నం తన స్వంత ప్రాంతం గా పేర్కొన్నారని ..ఆమె ఏ విధంగా ఈ జిల్లాకి ఆడబిడ్డ అయిందో చెప్పాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పేపర్లలో ప్రకటనలిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఇది చివరికి చిలికి చిలికి ఏ తీరం చేరుతుందో వేచి చూద్దాం.
ఖమ్మం వాళ్ళే చెబుతున్నారు కదా రేణుకా చౌదరి గారు తెలంగాణా బిడ్డ కాదని!ఇంకెందుకు అనుమానం? రేణుక చాలా ధైర్య సాహసాలు,చొరవ,వాగ్దాటి ఉన్న మహిళ!dare డెవిల్ ! ఆమెకు దూకుడు ఎక్కువ! హిందీలో కూడా అనర్ఘళంగా మాట్లాడుతుంది! రేణుక తెలంగాణా రాష్ట్ర వ్యతిరేకి గానే ముద్రపడ్డారు! అయితే మనకేం!రేణుకకు తెలంగాణాను అడ్డుకోగలిగే శక్తి లేదు!
రిప్లయితొలగించండిAavida porusham, abhimaanam kala acha telugu bidda. Anthe .........
రిప్లయితొలగించండి