ఈ బ్లాగులు వచ్చినాక ఇదొక ఫెసిలిటి...చూసిన సినిమాని మన్లోనే దాచుకోకుండా నలుగురికి చెప్పే అవకాశం ..!అత్తారింటికి దారేది సినిమా చూసిన తరవాత అనిపించింది కధ పెద్దగా లేకున్నా,విన్నూత్నత లేకున్నా కొన్ని అంశాల పాళ్ళు సరిగ్గా పడితే హిట్ అవకతప్పదని.ఇదే సినిమాని మరో హీరో తీస్తే ఫ్లాప్ అయినా ఆశ్చర్యం ఏమీ లేదు.ఇలాంటి ఇతివృత్తం తో కో కొల్లలుగా సినిమాలు వచ్చాయి.పవన్ కళ్యాన్ eccentric action ,త్రివిక్రం డైలాగ్స్,సన్నివేశాల్లోని వెరైటీ ఈ సినిమాని బాగా నిలబెట్టాయి.
పాటలు అన్నీ కాదుగాని కొన్ని బాగున్నాయి.ఫైట్స్ హాస్యాత్మకంగా ఉన్నాయి.ఫోటోగ్రఫీ బాగుంది.బొమన్ ఇరాని పాత్రలో ఎవరేసినా నప్పుతారు.గజనీ సినిమాలోని స్టోరిలైన్ నుంచి కధ ని డెవెలప్ చేశారు.ఎంటెర్టైన్మెంట్ కి ఓసారి చూడవచ్చు.నదియా హుందా గా చేసింది.ప్రణీత ఓ.కె....సమంతా చప్పిడి అందం కంటే ఈమే కాస్తా హాట్ అనిపిస్తుంది.Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి