Pages

5, డిసెంబర్ 2013, గురువారం

మసాల సినిమా పై నా రివ్యూ



రాం ఇంకా వెంకటేష్ నటించిన ఈ సినిమా మాతృక బోల్ బచ్చన్ అనే హిందీ మూవీ అన్నది తెలిసినదే.! వాల్ పోస్టర్ లో అజయ్ దేవ్గన్ లాంటి పొడుగు అంగీలు వెంకటేష్ వేసుకున్నప్పుడే అనిపించింది..ఇది మక్కీకి మక్కీ దింపేసిన సినిమా అని.కొన్ని మన ప్రాంతానికి తగిన మార్పులు చేస్తే బాగుండేది.

అంజలీ కి ఉన్నట్టుండి ఈ సినిమాలో మెల్లకన్ను వచ్చింది ఏమిటో మరి.అలాగే షాజన్ పదం సీ కూడా అంత గ్లామరస్ గా లేదు.పాటలు అంతంత మాత్రమే..!కామెడీ బేస్ గా ఉన్న ఈ సినిమా కొన్ని సార్లు బాగానే నవ్వించినా ఏదో లోటు ఉన్నది.సంతృప్తి గా వున్న విందు భోజనం లా లేదు.

జయప్రకాష్ ఎద్దు అనిపించుకోవడం లో ఏమి జోకు ఉన్నదో అర్ధం కాదు.ఇలాంటి తెలుగు కధలు గతం లో చాలా వచ్చాయి.గే గా రాం నటనలో కమల్ (విశ్వరూపం) ని అనుకరించాడు.ఇంకో పాత్రలో పవన్ కళ్యాణ్ ని పక్కగా ఇమిటేట్ చేశాడు. ఒకసారి చూడొచ్చు.చూడక పోయిన పెద్ద ఇబ్బంది లేదు.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి