Pages

7, డిసెంబర్ 2013, శనివారం

"ఆట ఆరంభం" సినిమా పై నా రివ్యూ



ఈ సినిమా ఆరంబం అనే తమిళ్ సినిమా కి డబ్బింగ్ వెర్షన్...అది మాత్రం అక్టోబర్ చివరిలో రిలీజ్ అయినట్టు గుర్తు.ముంబాయి టెర్రరిస్టుల దాడి జరిగినప్పుడు నాసిరకం బులెట్ ప్రూఫ్ జాకెట్ లని ధరించడం వల్లనే కొంతమంది పోలీసులు మరణించినట్లు మనం వార్తలు చదివాము.కరెక్ట్ గా అదే పాయింట్ ని తీసుకొని ఈ కధని తయారుజేశారు.అందుకు అభినందించవలసిందే..!

దేశభద్రత ని కూడా కాదని స్విస్ బ్యాంకుల్లో ధనం పోగుజేసుకునే వారి జోలికి ఈ దేశం లో ఎవరూ వెళ్ళరు.కాని వందో ..రెండు వందలో కక్కుర్తి పడే చిరు ఉద్యోగులజోలికి..పత్రికలనుంచి..టివీ ల దగ్గరనుంచి ఒంటికాలిమీద లేస్తారు.

బులెట్ ప్రూఫ్ జాకెట్ ల కాంట్రక్ట్ లో నాసి రకం వి సరఫరా చేసిన ఓ స్కాం ని ఎదుర్కునే క్రమంలో ..ఎదురైన అంశాలే ఈ సినిమా..కధనం అల్లిక బిగుతుగా బాగున్నది.దర్శకుడు విస్ణువర్ధన్ మంచి గ్రిప్పింగ్ తో నడిపించాడు.హాకింగ్ తో అంతర్జాతీయ బ్యాంకుల ని బురిడీ కొట్టించడం అందుకు తీసుకున్న సమాచారం ని మనం అభినందించవచ్చు కాని...అది అంత ఈజీ అయినప్పుడు ..నెట్ లో ది ఏదీ భద్రత దృష్ట్యా క్షేమకరం కాదు..!

నయనతార సెక్సీనెస్ తో అదరగొట్టింది.ఆమె అందాలు కాపాడుకొంటున్నతీరు కి హేట్సాఫ్.ఆర్య పరవాలేదు.ఫోటోగ్రఫీ బాగుంది.సంగీతం యావరెజ్.అజిత్ హీరో గా మంచి స్టైల్ తో..ఆకర్షణీయంగా చేశాడు.మన హీరోల మాదిరిగా కేవలం ఓవర్ డ్రెస్సింగ్ కి సంబందించిన స్టైలిష్నెస్ కాదు. ఈ సిన్మా చూస్తుంటె sword fish అనే ఓ ఇంగ్లీష్ సినిమా గుర్తుకొస్తుంది..అయితే పూర్తి అనుకరణ కాదు గాని నేటివిటి కి దగ్గరగా ఉంటూనే అనుసరించినట్లు కొన్ని సీన్లలో అనిపిస్తుంది.Click here

1 కామెంట్‌:

  1. అంతర్జాల బ్యాంకింగ్ మీద నమ్మకం పోగొట్టే సినిమా!అంత అలవోకగా అనాయాసంగా అంతర్జాతీయబ్యా౦కులను బురిడీ కొట్టించడం సాధ్యమా,చోద్యం కాకపొతే!!

    రిప్లయితొలగించండి