Pages

29, జనవరి 2014, బుధవారం

దళిత పారిశ్రామికవేత్తకి పద్మ అవార్డ్ వచ్చినా పెద్దగా ప్రాధాన్యమివ్వని మీడియా



రవికుమార్ నర్రా అనే దళిత వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తకి పద్మశ్రీ అవార్డ్ వచ్చినా ఆయనతో ఇంటర్వ్యులు మన ప్రముఖ దినవార పత్రికలలో ఎక్కడా నేను చూడలేదు.నిజానికి అగ్రవర్ణాల్లో పేద గా వుండి ఆ తరవాత పైకి ఎదగడం గొప్ప విషయం ఏమీ కాదు.ముఖ్యంగా చెప్పవలసినదేమంటే వారు పెద్దగా రాపిడి ని గాని ఘర్షణని గాని ఎదుర్కునే అవసరం ఉండదు.వెనకనో ముందో ఉన్న బంధువులు,స్నేహితులు ఎంతోకొంత స్నేహ హస్తం అందిస్తారు.కాని ఒక దళితుల అనుభవాలు భిన్నంగా ఉంటాయి.ముఖ్యంగా మన రాష్ట్రం లో క్రిందికి తోసివేయడానికి అనేక పాములు నిరంతరం కాచుకుని ఉంటాయి.కాబట్టి దళిత పారిశ్రామికులు వారి అనుభవాలు ఇంకా జనవ్యాప్తం కావాలి.

ఒక్క దళితులనేకాదు,బహుజనులు ఇంకా ఆర్ధికంగా వెనుకబడిన బ్రాహ్మణులు ..అంతా ఎందుకని వాణిజ్య రంగం లో పైకి రాకూడదు..?సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉండదు అనే చచ్చు పుచ్చు సామెతలకి తిలోదకాలు ఇచ్చి కొత్త పుంతలు తొక్కాల్సిన తరుణం వచ్చింది.  తమిళనాడు లో చూసినట్టయితే వ్యాపార,సినీ రంగాల్లో బాగా పైకి వచ్చిన వాళ్ళలో దళితులూ ఉన్నారు.అలాగే బ్రాహ్మణులూ ఉన్నారు.అదేవిధగా సాంప్రదాయ  వ్యాపారవర్గాలు ఉన్నాయి.కాని మన రాష్ట్రం లో చూసుకుంటే అలవిమాలిన గుత్తాధిపత్యం కొనసాగుతున్నది.

ఈ ధోరణి సమాజానికి శ్రేయస్సు కాదు.మొదటి తరాలు ధైర్యం వహించినప్పుడే తరవాత తరాలు పుంజుకుంటాయి.ఆ విధంగా చేయడం వల్లనే ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్న వర్గాలు శూద్ర స్థాయినుంచి నియో పాలకుల స్థాయికి ఎదిగాయి.  Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి