Pages

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

నేరస్తులు మొత్తానికి CCTV లో చిక్కిపోయారు...!



ఢిల్లీ లోని లజపతినగర్ లో దెబ్బలు తిని ఆ తరవాత కన్నుమూసిన అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన కుర్రాడు నిడొ టానియం(20) గూర్చి మనకి తెలిసిందే.ఒక షాప్ ఓనర్ ని దారి గురించి విచారిస్తుండగా ..అక్కడే ఉన్న ఇంకొంతమంది కుర్రాళ్ళు నిడో తన తలకి వేసుకున్న ఎర్ర రంగు విషయమై కామెంట్స్ చేయడం జరిగింది.దానికి అతను అభ్యంతరపెట్టడం తో వాళ్ళు అంతా కలిసి ఈ కుర్రవాణ్ణి గుద్ది చంపేశారు.మొత్తానికి ఇవాటి వార్తలు ప్రకారం నేరస్తులని CCTV లో గుర్తించారు.అంతా ఆ చుట్టు ఉన్న వ్యాపారస్తులే. కుర్రవాళ్ళే ఉన్నారు.సోమవారం దీనికి సంబందించి ఢిల్లీ పొలీసులు సోమవారం కోర్ట్ కి నివేదించనున్నారని తెలిసింది.

ఈశాన్య రాష్ట్రాల వారిని భారతదేశం తన main stream లో ఇంకా కలుపుకోలేక పోయిందా అనే అనుమానం ఈ సంఘటన వల్ల వస్తుంది.చైనా ,బర్మా వారి భౌతికపరమైన పోలికలు ఎక్కువ ఉండే ఈశాన్య రాష్ట్రాల వారు బ్రిటీష్ వారి పాలన వలన వల్ల మన దేశం లో భాగమయ్యారు.సిలిగురి కారిడార్ మాత్రమే వారిని రహదారి పరంగా మన main land తో కలుపుతుంది.అభివృద్ది ఎంతో జరగవలసివుంది.  Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి