Pages

10, ఫిబ్రవరి 2014, సోమవారం

అమాస్టర్ డం లో అద్భుతం (నవల) పై నా సమీక్ష.

.

అమాస్టర్డం గురించి ఏమి చెప్పారో చూద్దామని పుస్తకం కొన్నాను.మధురాంతకం నరేంద్ర రాసినదిది.27 పేజీలదగ్గరకి వచ్చేసరికి ఇక చదవాలని అనిపించలేదు.సరే ముందు ముందు ఏమైనా ఉందేమొ చూద్దాం అని చెప్పి పళ్ళబిగువున చివరిదాకా చదివాను. ప్చ్ ..ఏమీ లాభం లేదు.ఇంతాచేసి దీని ఇతివృత్తం ఏమిటంటే రచయిత ప్రభుత్వం తరపున సాహిత్యపరమైన డెలిగేట్ గా వెళుతూ ..అతనితో బాటూ దమ్మలాల్ చోప్రా అనే ఆయనతో కలిసి విమానప్రయాణం చేస్తాడు.మెక్సికో అటునుంచి అమాస్టర్డం అన్నమాట ప్రయాణం.తీవృవాదుల నేపధ్యం లో సెక్యూరిటీ పరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని ఫోకస్ చేస్తూ రాయడం జరిగింది.కధంతా అంతా విమానాశ్రయాం లోనే జరుగుతుంది.

శైలి సులువుగా ముందుకు పోనివ్వదు.కృతకంగా వాక్య,సన్నివేశాల రూపకల్పన సాగింది.చోప్రా ని పరమ సన్నాసిగా చూపడం మరీ తెలుగు సినిమాల్లోని పోకడ అనిపించింది.ఈ నవలని ఇంకా మంచి గ్రిప్ గా రాయవచ్చు.అయితే దానికి చాలా పరిశ్రమ చేయాలి.మతం యొక్క మూలం,పరిణామం,చరిత్ర  లాంటివి చర్చినట్లు రచయిత భరతవాక్యం లో చెప్పారు.అదెక్కడున్నదబ్బా అనిపిస్తే పాఠకుని తప్పు కానేకాదు. 

డచ్ వాళ్ళు మన ఇండియా లో ఎక్కడెక్కడ కొన్నివందల ఏళ్ళ క్రితం ఎలా తిష్ట వేసినదీ..ఇండోనేషియా లో జనాల్ని ఎన్ని తిప్పలు పెట్టినది కనీసం కొన్ని వాక్యాల్లోనైనా చెబుతారేమొనని చూశా...అంటే సంధర్భం వచ్చిన స్థలంలోనే సుమా..చరిత్ర మరీ అడగడంలేదు.Click here


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి