కృష్ణవంశీ చాన్నాళ్ళ తరవాత తీసిన సినిమా కదా అని వెళ్ళా..!సినిమా concept అయితే బాగానే ఉంది గాని ఎందుకో మలిచిన విధానం లో అందం కొంత కొరవడింది.హీరో,హీరోయిన్ లు బాగానే చేశారు.ముఖ్యంగా పాటలు ఉండాల్సినంతగ బాగా లేవు.ఖడ్గం చాయల్లో ...ముస్లిం కల్చర్ని...పాతబస్తీ ని చూపెట్టే ప్రయత్నం కనబడింది.అయితే charm లేదు.
చరణ్ రాజ్ పాత్ర ఓ ప్రముఖ పొలిటీషియన్ని గుర్తుకుతెస్తుంది. తొందరగా అడ్డదారుల్లో రిచ్ అయిపోవడానికి డబ్బున్న అమ్మాయిలని పెళ్ళిచెసుకోవాలనే కాన్సెప్ట్ బయట ఎక్కడో గాని సక్సెస్ గాదు.డబ్బున్న అమ్మాయి తనకన్నా ఉన్నవాడిని చూస్కుంటుంది..లేదా ఆమె బంధువులైనా అతడిని ఉతికి ఆరేస్తారు.చచ్చి చెడి చేసుకున్నా ఆమె కాలికింద చెప్పులా బతకాలిసిందే..!
మెహెంది కి వెళ్ళి సరదా గా బిహేవ్ చేయడం ఎబ్బెట్టుగా వుంది.తెలుగు దర్శకులు ..తీస్తే blunt గా మోటుగా తీస్తారు సరసాన్ని. హాలీవుడ్ సినిమాలో నోట్లో నోరు పెట్టి కిస్ చేసినా ఆ సంధర్బానికి కలిసిపొయినట్టు ఉంటుంది తప్ప వెగటు కలిగించదు.
ఫోటోగ్రఫీ సాదాగా ఉంది.సంగీతం కూడ ఏవరేజ్. Click here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి