Pages

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఇంత డ్రామాలు వేషాలు వేసే పార్లమెంట్ సభ్యులు ఎక్కడైనా ఉంటారా..?



లగడపాటి రాజగోపాల్ చల్లిన పెప్పర్ స్ప్రే తెలంగాణా వాదన పై దేశవ్యాప్తమైనసానుభూతి కురిపించింది.నిజంగా వీరంతా సమైక్యవాదానికే కట్టుబడిన వారే అయితే బిల్లు సభలోకి రాకముందే మూకుమ్మడిగా రాజీనామాలు చేసివుండేవారు.కాని దానికి చెప్పే సాకులు..ఏమిటి...మేము సభలో ఉంటేనే పోరాడగలం అని.ఇప్పుడుఏ రకమైన పోరాటం చేసింది.ఇది ఏ రకంగా సమైక్యానికి తోడ్పడుతుంది.లేని సానుభూతిని సైతం టి బిల్లుకి తెచ్చిపెట్టారు.నిజంగా ఆలోచిస్తే తెలంగాణావాదులు ఈసారి ఎంతో సమ్యమనం తో,రాజనీతిజ్ఞత తో అడుగులు వేస్తూ వారి గమ్యాన్ని చేరుకొంటున్నారు.కింది కేడర్ కొంత గందరగోళపడినా  పైవాళ్ళు చక్కటి ప్లానింగ్ తో ప్రొగ్రస్ సాధిస్తున్నారు.బిల్లుని సభలో పెట్టే స్థాయికి తీసుకురాగలిగారు.కాని రాజగోపాల్ లాంటివాళ్ళు మాత్రం స్వంత ఆకర్షణ ని ..గ్లామర్ ని పెంచుకోవడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ సీమాంధ్రులు నిజంగా దోపిడి దారులే నేమో అనే భావాన్ని దేశం మొత్తం లో కలిగిస్తున్నారు. 

వీరి చర్యలు ఎలాఉన్నాయంటే పూర్తిగా అధిష్టానాన్ని వ్యతిరేకించలేరు.ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే వ్యాపారరాయితీలు కావాలి వీళ్ళకి.సబ్సిడీలు కావాలి.ఇంకా సవాలక్ష లావాదేవీలు..! అలాంటి వీరు ప్రజల పక్షంగా ఉండి త్యాగబుద్దిని ఎలా ప్రదర్శించగలరు. Click Here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి