గత రెండు సంవత్సరాలనుంచి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తేవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.నల్ల ధనం దాచిన వారి పేర్లు కూడా కొన్ని బయటికి వచ్చాయి.ఏమైందో గాని ఆ ప్రయత్నం అలా అణగారిపోయింది.సరే...ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఉన్న ఓ కమిటీ ని వేశారు.దానిలో ఒకరైన జస్టిస్ షా మొన్న ఓ ప్రకటన చేస్తూ స్విస్ ప్రభుత్వం కొన్ని వివరాలు పంపినట్లు తెలిపారు.మరో సభ్యులేమో ఇంకా వివరాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఇది ఎంత వరకు సఫలీకృతం అవుతుందో ఆ దేవుడికే తెలియాలి.కమిటీలు వేయడం ...కాలం వెళ్ళబుచ్చడం..మన వ్యవస్థలో ఎప్పటినుంచో చూస్తూనేఉన్నాం.ఈ నల్ల ధనం...పార్టీ బేధాలు లేకుండా అన్ని రంగుల ని ఏకం చేస్తుంది.డబ్బుని కాపాడుకోవడం లో ఆ పార్టీ..ఈ పార్టీ అని ఏముంది.
అసలు ఈ పాటికి చాలా మంది స్విస్ బ్యాంకుల్లోనుంచి ఎప్పుడో ఇతర దేశాలకి వారి నల్లధనం తరలించి వేశారని ఒక వార్త.ఏమైనా ఉంటే అడుగు బొడుగువి ఖాతాలు దొరుకుతాయి.అవీ దేశం ఖజానా లోకి వస్తాయన్నదీ అనుమానమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి