Pages

22, జూన్ 2014, ఆదివారం

అమెరికా తరహా పోలీస్ రక్షణ వ్యవస్థ హిట్ అవుతుందా....?



కావచ్చు...కాకపోవచ్చు....అది ఇప్పుడే చెప్పలేము....కొంత కాలం గడిస్తే గాని చెప్పలేము.అమెరికా ని చాలా మంది చాలావిషయల్లో అనుకరించాలని చూస్తుంటారు.కాని అది అంత ఈజీ గా సాధ్య పడదు.వాళ్ళకున్నంత టైం సెన్స్ మనకుంటుందా..? అంతే కాదు ...మన మీద ఉన్నంత రాజకీయ ఒత్తిళ్ళు వాళ్ళ మీద ఉండవు.జార్జ్ బుష్ కుమార్తె తాగి డ్రైవ్ చేస్తే తీసుకెళ్ళి లోపల వేశారు. కాని దేశ  అధ్యక్ష స్థానంలో ఉన్నా ఆమె తండ్రి ఆమెని సమర్దించలేదు.అంత నిజాయితీ మనకుందా...?

వాళ్ళ దేహాన్ని అనుకరించడం కాదు.ఆత్మని అనుకరించండి.అప్పుడు సాధ్యపడుతుంది అది.మన కొడుకులని,కోడళ్ళని అమెరికా లో చదివిస్తాము.ఎందుకు...? పదిమంది  ముందు గొప్పగా చెప్పుకోడానికి..అంతే..! కాని వారి ఆత్మని ...పద్దతులని అనుసరిస్తే.....మన కొడుకులు....లేదా బామ్మర్దులు....పైకి రాలేరుగా..! దేశానికి ఈ రోజున శత్రువులు ఎక్కడో బయటి దేశాల్లో లేరు.మన దేశం లోనే ఉన్నారు.ఏది మంచో...ఏది న్యాయమో తెలిసీ ...విదేశీ జ్ఞానాన్ని తమ కుల అభివృద్దికో....కుటుంబ అభివృద్దికో వాడుకునే ...నాయక శిఖామణుల్లోనే ఉన్నారు...అది ఇటు గాని...అటుగాని...! 

1 కామెంట్‌: