Pages

28, జూన్ 2014, శనివారం

మనిషి ప్రాణాన్ని కార్పోరేట్ సంస్థలు హరిస్తే ఎంత దారుణమైన పెనాల్టీలు అక్కడ విధిస్తారో వీరికి తెలియాదా...?




GAIL కనీసం ఒక్కో కుటుంబానికి 2 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి..!

నిన్న తూర్పు గోదావరి జిల్లా లోని నగరం గ్రామం లో GAIL పైప్ లైన్ లు లీక్ అయి మరణించిన 15 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి కనీసం 2 కోట్ల రూపాయల నైన పరిహారంగా చెల్లించాలి.GAIL కొన్ని వందల కోట్ల రూపాయల లాభాలను ఒక ఏడాదికి ఆర్జిస్తుంది.మరణించిన వారికి తలా 2 లక్షలె ఎక్స్ గేషియ ప్రకటించడం అన్యాయం.ఇది పూర్తిగా ఆ సంస్థ యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది.మనిషి ప్రాణానికి అతి తక్కువ వెల కట్టడం బహుశా ఇండియా లో ఒక ఆచారంగా మారిపోయింది.అందుకనే లాభాలు దండిగా ఆర్జించే సంస్థలు కూడా ప్రాణాలతో ఆడుకొంటుంటాయి.ప్రతిదానికి మేము అమెరికా తో  పోటీ పడతాము అని చెప్పుకునే మన నాయకులు మనిషి ప్రాణాన్ని కార్పోరేట్ సంస్థలు హరిస్తే ఎంత దారుణమైన పెనాల్టీలు అక్కడ విధిస్తారో వీరికి తెలియాదా...? 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి