Pages

29, జూన్ 2014, ఆదివారం

ఆదర్శాన్ని చేతల్లో చూపిన ఆ కలెక్టర్ ని అభినందించక తప్పదు.



తమిళ నాడు లో గల ఈరోడ్ జిల్లా కి చెందిన ఓ ఐ.ఏ.ఎస్.అధికారి తన సంతానాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి మాటల్లో కాక చేతల్లో పనితనాన్ని చూపించాడు.మన వాళ్ళు ..మంత్రులు గాని..ఉన్నత అధికారులు గాని అందరూ ప్రభుత్వ బళ్ళలో చేర్చితే ఎందుకు మెరుగు పడవు..?అసలు చెడిపోయి ఎక్కడ చచ్హాయి గాని...అలా ఒకటి కి పది సార్లు ...ప్రచారం చేస్తే పేపర్లో ఏది వస్తే దాన్నిచానా మంది జనాలు ఆ మేనియాలో వాదించేస్తుంటారు.10 కి 10 పాయింట్లు వచ్చిన పదో తరగతి ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధికి ప్రవేటు పాఠశాల విధ్యార్ధి అంత అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఎందు కంటే ఎంత ప్రచారం చేసుకుంటే అంత రాబడి అక్కడ.కాబట్టి పాంప్లెట్లతో...యాడ్లతో హోరెత్తించుతుంటారు కార్పోరేట్ వాళ్ళు....!

ప్రస్తుతం మనకున్న గొప్ప గొప్ప అధికారులుగాని...విదేశాల్లో సెటిలయిన శాస్త్రవేత్తలు గాని అంతా ప్రభుత్వ బళ్ళలో చదువుకున్నవారే.అయితే ఈ కాలం లో రాజకీయానికి...వ్యాపారానికి ...అసలు ఎడమే లేని ఈ కాలం లో ఖరీదైన ...చదువుల బడులన్నీ ,బంగారు బాతు లాంటి లాభాలు తెచ్చి పెట్టే ఇలాంటి బిజినెస్ లు అన్ని మన పాలకుల ప్రత్యక్ష పరోక్ష బంధువులతో నిండిపోయి ఉన్నాయి.కాబట్టి సృజనాత్మకత ఎవడికి కావాలి..ఆదర్శం ఎవడికి కావాలి...?కావలసిందల్లా ధనం...!దానికి వందిమాగధ మీడియా ఎలానూ ఉంటుంది.
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి