Pages

12, డిసెంబర్ 2014, శుక్రవారం

"లింగా" సినిమా పై రివ్యూ...!



ఈ రోజు రిలీజ్ అయిన లింగా సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు.అంచనాకి తగినట్లుగా ఉన్నదా చూద్దాం.రజనీ సినిమా ల్లో పంచ్ డైలాగులు,మంచి పాటలు,కధ చెప్పే విధానం అలరించే విధంగా ఉంటాయి.అందుకనే అతని సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది.అతని స్టైల్ అంటారు గాని నేచురల్ గా అతని ఫ్లెయిర్ నే అలా డెవెలప్ చేసుకున్నాడు.కనుకనే అది అతనికి సూట్ అయింది..అది చూసి చాలామంది కాపీ కొట్టాలకుంటారు గాని అది వారికి సూటవదు.

ఇక సినిమా లోకి వద్దాం. రెండు పాత్రల్ని సమర్ధనీయంగా పోషించాడు.ఒక దొంగ గాను,ఇంకో దానిలో రాజా మరియు బ్రిటిష్ సివిల్ సర్వెంట్ పాత్ర లోనూ..! రెండవ పాత్ర ద్వారా చూపించారు.అయితే అది ముత్తు లో జమీందార్ ని గుర్తుకి తెచ్చింది.బ్రిటిష్ హయాం లో కలెక్టర్ గా  కొన్ని సన్నివేశాల్లో బాగా చేశాడు రజని.పేద గా మారిన తరువాత కూడ తన జీవితం పట్ల సంతృప్తి వ్యక్తం చేసే సీన్ లలో దటీజ్ రజనీ అనిపిస్తాడు.

అప్పటి వాతావరణాన్ని రప్పించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.బ్రిటిష్ వారితో చేసే సంభాషణల్లో మంచి డెప్త్ ఉంది.తాత కట్టించిన డాం ని బద్దలు గొట్టాలని చూసే విలన్ ఆట కట్టించడానికి అక్కడ  ఆ గ్రామం లో ఉండిపోతాడు హీరో.ఆ క్రమం లో కధ నడుస్తూ ఉంటుంది.

సోనాక్షి సిన్ హ ,అనుష్క,సంతానం తమ పాత్రల మేరకు నటించారు.జగపతి బాబు పరవాలేదనిపించాడు.రెహమాన్ సంగీత పరంగా నిరాశపరిచాడు.ఫోటోగ్రఫీ బాగుంది.దర్శకుడు సినిమా నిడివిని తగ్గించి ఉండవలసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి