అసలు ఇలాంటి కాన్సెప్టులతో సినిమాలు రావడం కూడా ఈ రోజున యువతీ యువకుల ప్రేమల్లో చాలా అవాంచనీయ ధోరణులు పెరగడానికి కారణమేమో.హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ అయిపోతుంది.హీరో మీద ప్రేమ కూడ ఆమెకి ఉండదు.కాని హీరో మాత్రం పట్టువదలని అక్రమార్కుడి వెంటతగులుకుని నస బెడుతూ మనల్ని ప్రేమ అనుకోమంటాడు.ఇలాంటివి బయట జరిగితే అమ్మాయి పోలిస్ కంప్లైంట్ ఇస్తుంది.ఫేమిలీ లో ఇంకా గట్టివాళ్ళు ఉంటే మక్కెలిరగదీస్తారు.అసలు ఆడది ఇష్టపడనప్పుడు జిడ్డులా తగులుకుని వేధించేది హెరాస్మెంట్ అవుతుంది గాని అది ప్రేమ ఎలా అవుతుంది.ఈ తెలుగు సినిమాలు ఎప్పటికి మారతాయో.దానికి తోడు ఈ హీరో కి ఉద్యోగం సద్యోగం ఉంటుందా ..అదీ ఉండదు.కాని ఉద్యోగం చేసే అందమైన ఆడపిల్ల మాత్రం ఈయన కి పడిపోవాలి.ఇలాంటప్పుడే క్లాష్ లు వచ్చి ఆసిడ్ దాడులు,హత్యలు ప్రేమికుల మధ్య జరిగేది.
ఇలాంటి సినిమాలు వస్తే ఏమిటి..రాకపోతే ఏమిటి..? మళ్ళీ పైగా ఆ డైలాగ్ డెలివెరి అచ్చం పోరంబోకు లా వెధవ సొల్లు డైలాగులు.అదో యాసలో..!
ఒక సినిమా లో అనేక సినిమాలు మిక్స్ చేసినట్లు అనిపించింది.కొన్ని సన్నివేశాలు అసలు ఇవి అవసరమా అనిపిస్తాయి.హీరోయిన్ కొన్ని తరహా పాత్రలకి బావుంటుంది.హీరో అనేకమంది ఇతర హీరోలని ఇమిటేషన్ చేస్తుంటాడు.కధంతా గందరగోళంగా ఉంది.కొన్ని హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి.కె.ఏ.రాధాకృశ్నన్ సంగీతం లో రెండు పాటలు పరవాలేదనిపిస్తాయి.దర్శకుని లో టాలెంట్ ఉంది గాని ఇంకా సాన పట్టాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి