ఈ మధ్య నందమూరి జానకి రాం ఏక్సిడెంట్ లో మరణించినపుడు..ఒక డైలీ లో చదివాను..ఒకరి అమూల్యమైన సలహాని..!ఆయన డ్రైవర్ ని గనక పెట్టుకొని ఉంటే ఆ యాంగిల్ లో దెబ్బ తగిలినదానికి ఆ డ్రైవర్ పోయి ,కనీసం ఈయన బ్రతికే వాడని.ఏం ఊహ రా బాబు.అంటే ఆ డ్రైవర్ ది ప్రాణం కాదా..అతని భార్య,పిల్లలు అతని కోసం ఏడవరా..! నిజానికి డబ్బున్న ఫేమిలీ లోని వ్యక్తి చనిపోయినా మిగతా కుటుంబీకులకి ఆర్దికమైన ఇబ్బందులు ఉండవు..కాని అదే సామాన్యుడికైతే ఆ కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం.మనం అనుభవించే చెప్పుకోలేని మానసిక,శారీరక చిత్రహింసలన్నీ మన కౄర ఆలోచనల ఫలితమే.ప్రతి ఒక్క మనిషి దాన్ని గుర్తుంచుకోవాలి.
Pages
9, డిసెంబర్ 2014, మంగళవారం
అంటే అతని ప్రాణం పోయినా ఫరవాలేదన్నమాటా..?
ఈ మధ్య నందమూరి జానకి రాం ఏక్సిడెంట్ లో మరణించినపుడు..ఒక డైలీ లో చదివాను..ఒకరి అమూల్యమైన సలహాని..!ఆయన డ్రైవర్ ని గనక పెట్టుకొని ఉంటే ఆ యాంగిల్ లో దెబ్బ తగిలినదానికి ఆ డ్రైవర్ పోయి ,కనీసం ఈయన బ్రతికే వాడని.ఏం ఊహ రా బాబు.అంటే ఆ డ్రైవర్ ది ప్రాణం కాదా..అతని భార్య,పిల్లలు అతని కోసం ఏడవరా..! నిజానికి డబ్బున్న ఫేమిలీ లోని వ్యక్తి చనిపోయినా మిగతా కుటుంబీకులకి ఆర్దికమైన ఇబ్బందులు ఉండవు..కాని అదే సామాన్యుడికైతే ఆ కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం.మనం అనుభవించే చెప్పుకోలేని మానసిక,శారీరక చిత్రహింసలన్నీ మన కౄర ఆలోచనల ఫలితమే.ప్రతి ఒక్క మనిషి దాన్ని గుర్తుంచుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగా చెప్పారు.
రిప్లయితొలగించండినాకూ ఈ మాటలు విన్నప్పుడు ఇలాగే అనిపించి అసహ్యం వేసింది. ఐతే, ఒకవేళ వీరన్నట్లే జరిగి ఆ డ్రైవరే గనుక చనిపోయి ఉంటే అతడికి ఇలా వేలంవెర్రిగా జనం పోయి స్వయంగా సానుభూతులు ప్రకటించేవారా? ఆ అభాగ్యమానవుడి భార్యాబిడ్డలను ఓదర్చేవారా, అతడి అంత్యక్రియలను లైవ్ టెలికాష్ట్ చేసేవారా? 'తృటిలో గండం తప్పించుకున్న హరికృష్ణ కుమారుడు జానకిరాం' అని ఒక వార్త ప్రముఖంగా వేసేవారు. డ్రైవరు చనిపోయాడన్న మాట ఏదోమాటారసకు ప్రస్తావించేవారు. ఆ తరువాత అంతా జానకీరాం ను అభినందించేవారు, పరామర్శించేవారు. అక్కడితో సరి, అంతే కదా?
పసిడి గలుగు వాని పృష్ట్నంబు పుండైన
వసుధలోన చాల వార్తకెక్కు
పేదవాని యింట పెండ్లైన నెఱుగరు
విశ్వదాభిరామ వినుర వేమ
అని వేమన్న ఏనాడో ఈసడించాడుగా ఇల్లాంటి బుధ్ధులున్న మన దొడ్డ సమాజాన్ని!
ఇంక పేదవాడి చావు గురించి ఎవరికి పట్టింది! అందుకే కాబోలు 'ఆ డ్రైవరన్నా పోయాడు కాదు' అని తేలిగ్గా అనగలిగారు మూర్ఖులు.