Pages

14, ఏప్రిల్ 2015, మంగళవారం

ఓం సిటి వస్తే అసలు పుణ్యక్షేత్రాలు తిరగనవసరమే లేదా..!?

ఈ రోజు పేపర్లో చదివి ఏం అనాలో అర్ధం కాలేదు.మొత్తానికి ధన సంపాదనకి క్షేత్రాల సెంటిమెంట్ కూడా వదల్లేదా..?దేశం లోని వందల పుణ్య క్షేత్రాల రెప్లికా లని ఓ చోట పెట్టవచ్చుగాక.కాని ఆ ప్రదేశాన్ని దర్శిస్తే ఆయా క్షేత్రాల్ని అన్నిటిని దర్శించిన ప్రాప్తి ఎలా కలుగుతుందో ఆ పై వాడికే తెలియాలి.ఏ పుణ్య క్షేత్రమైన ఎందుకు దర్శిస్తారంటే అక్కడ తిరుగాడిన,ఆ వాతావరణం ని పునీతం చేసిన ఎంతో మంది మహానుభావుల పాదస్పర్శలు ఆ చోట సూక్ష్మ రూపం లో ఉంటాయని తప్ప మరోకందుకు కాదు. ఏ క్షేత్ర మహత్యం దానిదే.తప్ప అక్కడున్న గుడి కంటే వంద రెట్ల విలువతో  వేరే చోటకట్టినా దానికి పవిత్రత రాదు గాక రాదు. పైగా అది చాలా అపచారం కూడా..! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి