Pages

5, ఏప్రిల్ 2015, ఆదివారం

మేధావులు ,వివిధ ప్రజా సంఘాలు కూడా తేలు కుట్టిన దొంగల్లా ఏం మాట్లాడకుండా ఉండటం శోచనీయం.

ఈ రోజు పేపర్లో చదివాము.కరుడు గట్టిన ఉగ్రవాదుల్ని ఇద్దర్ని నల్గొండ జిల్లాలో పోలీసులు తమ ప్రాణానికి తెగించి మట్టుబెట్టిన వైనం.వాళ్ళు సిమి కి చెందిన కార్యకర్తలని వార్తల ద్వారా తెలుస్తోంది.మొదట సూర్యపేట బస్ స్టాండ్ లో తుపాకి ద్వారా పోలీసుల్ని తీవ్రంగా గాయపరిచినప్పుడే ప్రజలు అనుమానించారు దీనిలో ఉగ్ర కోణం ఉన్నదేమోనని.మళ్ళీ పోలీస్ లపై దాడి చేసి ముగ్గుర్ని బలి తీసుకొనడం దారుణం.అయితే ఇప్పటికి దీన్ని అంతరాష్ట్ర దొంగలు పని అని చెప్పి తెలంగాణా రాష్ట్ర హోమంత్రి వర్యులు చెప్పడం వింతగా ఉంది.

కుదిరిన పొత్తులు ఉగ్ర వాదం వేళ్ళూనడానికి సహకరించరాదు.దేశ రక్షణ అనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి.ఒక వర్గం వారికి కోపం వస్తుందేమో అని ఊరుకొని దేశ హితం విషయం లో రాజీ పడితే మూల్యం చెల్లించేది ఎవరో కాదు రక్షక సిబ్బంది ఇంకా సామాన్య ప్రజలు.మేధావులు ,వివిధ ప్రజా  సంఘాలు కూడా తేలు కుట్టిన దొంగల్లా ఏం మాట్లాడకుండా ఉండటం శోచనీయం.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి