Pages

24, మే 2015, ఆదివారం

"ఎంతవాడు గాని" సినిమా పై రివ్యూ...!



అజిత్ నటించిన ,గౌతం వి.మీనన్ డైరెక్ట్ చేసినసినిమా అని చెప్పి వెళ్ళడం జరిగింది.ఈ సినిమా మాతృక తమిళం లో "ఎన్నై అరిందాళ్"అని చెప్పి ఫిబ్రవరి లో రిలీజయింది.తెలుగు డబ్బింగ్ లో మనకిప్పుడు.మన బలవంతపు రుద్దుడు హీరోల్ ని చూసి చూసి కొంత వెరైటి ఉంటుంది గదాని వెళ్ళడం జరిగింది. అయితే పెట్టిన డబ్బులకి నష్టం అనిపించలేదు.ఒక సినిమా ని స్టైల్ గా ,కొత్త గా తీయడం అంటే మన తెలుగు హీరోలకి ఏమిటంటే రకరకాల గెటప్స్,కలర్ ఫుల్ డ్రెస్ల్ వేయడం ,హీరోయిన్ లని పరమ రోత గా చూపించడం.ఆ విషయం  లో చూస్తే అజిత్ ని ఇలాంటి తెల్ల రంగు జుట్టు తో చూపించడం సాహసమే.ఆ మధ్య జగపతి బాబు కూడా అలా కనిపించింది అంతకు ముందు అజిత్ ని ఇంకో సినిమాలో  అలాంటి గెటప్ లో చూసే.ఏదైనా ఒకరు దారి వేస్తే ,హిట్ అయినట్టు అనిపిస్తే మనవాళ్ళు రెడీ అనుకరించడానికి.

సినిమా గురించి చెప్పాలంటే ఒక పోలీస్ యాక్షన్ సినిమా.అయితే మీనన్ తమిళ్ లో "కాక్క కాక్క,విలయ్ తాండి వరువాయ" అనే పోలీస్ హీరో సినిమాల్ని చేశాడు.ఇది మూడోది అంటే.చెప్పుకోవాలంటే ట్రయాలజి.అజిత్ ఒక పోలిస్ ఉన్నతాధికారి. చంద్రముఖి (అనుష్క) ని కాపాడుతూ మొదట ఎంట్రీ ఇస్తాడు.ఆ తర్వాత ఆమె ని చంపడానికి (గుండె తీసుకునుటకు) అరుణ్ విజయ్ ప్రయత్నం చేస్తాడు. అసలు అరుణ్ విజయ్ కి అజిత్ కి ఉన్న సంబంధం ఏమిటి.దాని పరిణామాలు ఏమిటి.అండర్ కవర్ ఆపరేషన్ అవసరం ఎందుకు కలిగింది.ఇదంతా సినిమా చూస్తే తెలుస్తుంది.తెలుగు లో కి డబ్బింగ్ చేసేప్పుడు కొన్ని సీన్లు కట్ చేసి ఉండొచ్చు.అందుకే కొన్ని చోట్ల క్లారిటీ కలగదు.ఏది ఏమైనా అజిత్ నటన,త్రిష ,అనుష్కలు ఇంకా ఇతరులు పాత్రల పరిధి మేర చేశారు.ఎక్కడా మరీ ఓవర్ ఉండదు.ఫస్ట్ హాఫ్ కొద్దిగ మెల్లిగా నడుస్తుంది.ఆ తర్వాత నుంచి జోరు అందుకుంటుంది.మీనన్ తనదైన శైలి లో తీశాడు.వెనకది ముందుది వెనక్కు అయినట్లు కొన్ని సార్లు అనిపిస్తుంది.సినిమా లో ఒక మంచి థీం ఉంది..అదేమిటంటే ఎంతసేపు జ్ఞానం అంటే ఉన్నచోట ఉండడం కాదు.అలా కొత్త ప్రదేశాలు చూస్తూ,కొత్త సంస్కృతులు తెలుసుకుంటూ ప్రయాణాలు చేయడం అనిపించి కూతురు తో బాటు అజిత్ కూడా ఇద్దరు రైలు ప్రయాణాలు చేయడం అనేది మంచి ఆలోచన.జీవితం ని పుస్తకాల్ని చదివిన వారికి మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తాయి.


త్రిష లో మునుపటి అందం ఉందా అనిపిస్తుంది.కెమెరా బాగుంది.హేరిస్ జయరాజ్ పేరుని టైటిల్స్ లో మనవాళ్ళెప్పుడూ హరీష్ జయరాజ్ అని వేస్తుంటారు. ఈసారి అంతే.ఒకసారి చూడవచ్చు..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి